సురేందర్ రెడ్డి భారీ ప్లానింగ్.. నెక్స్ట్ సినిమా ఇదే..?

‘సైరా’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. దేశ స్వాతంత్రం కోసం తెలుగు ప్రాంతానికి చెందిన మొట్టమొదటి పోరాట యోధుడిగా చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సైరా సినిమాను తెరకెక్కించి అద్భుతమైన హిట్ .ని మెగా అభిమానులకు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఇచ్చి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

దీంతో ఇప్పుడు సురేందర్ రెడ్డి తర్వాత చేయబోయే సినిమా ఎవరితో అన్నది ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. వస్తున్న వార్తల ప్రకారం డైరెక్టర్ సురేందర్ రెడ్డి తర్వాత..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో గాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో గాంధీ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా భారీ బడ్జెట్ లోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో సురేందర్ రెడ్డి ఏ స్పందించాలి. ప్రస్తుతం మాత్రం సురేందర్ రెడ్డి సైరా సక్సెస్ సంబరాలలో మునిగితేలుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సైరా సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కిటకిటలాడుతున్నాయి.