మెగా హిరోతో,చిరంజీవి మల్టీస్టారర్, ఇలా అయితే మెగా ఫ్యాన్స్ కి పండగే…

తెలుగులో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కొడుకు గా ఆయన సినిమాల్లోకి వచ్చినా సరే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని రామ్ చరణ్ చాలా తక్కువ కాలంలోనే సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో రామ్ చరణ్ కి అంటూ ఒక ప్రత్యేకమైన ఫాన్స్ బేస్ కూడా ఉంది. ఇక అమ్మాయిల్లో అతనికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఇది పక్కన పెడితే రామ్ చరణ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమా ఎలా ఉంటుంది నటన ఏ విధంగా ఉంటుంది అంటూ చర్చలు కూడా చేస్తూ ఉంటారు.

అయితే అతను ఒక సినిమా తన తండ్రి తో కలిసి నటించాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా వస్తే ఒకరకంగా పండగ. తండ్రి సినిమాలో రామ్ చరణ్ అప్పుడు అప్పుడు కనపడుతూ ఉంటాడు గాని పూర్తి స్థాయి సినిమా మాత్రం వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు రాలేదు. కాని వీరి కాంబినేషన్ లో తండ్రి కొడుకు గా ఒక సినిమా చెయ్యాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే… వస్తే మాత్రం చాలా మంది అభిమానులకు కనుల విందే.ఇక ఈ కాంబినేషన్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నా అది ఇంకా ముందుకు అడుగు పడలేదు అనేది వాస్తవం.

ఈ కాంబినేషన్ కోసం మన తెలుగు ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నా ఏ దర్శక నిర్మాత కూడా ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదు. టాలీవుడ్ లో వీరికి మంచి మార్కెట్ ఉన్నా సరే దర్శక నిర్మాతలు మాత్రం రావడం లేదు.