సుజిత్ కి ఏక్కడో సుడుంది, మెగాస్టార్ ని డైరేక్ట్ చెస్తున్నడుగా…

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. సామాజిక సందేశాన్ని తన సినిమాలో బలంగా వినిపించే దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ ఒకానొక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. దీనికోసం రాజమౌళి పర్మిషన్ ఇచ్చాడని సమాచారం. అయితే ఈ సినిమా అనంతరం చిరంజీవి, మళయాల చిత్రమైన లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలిసిందే.లూసిఫర్ సినిమా బాధ్యతల్ని చిరంజీవి సాహో డైరెక్టర్ సుజిత్ కి అప్పగించాడు.

సుజిత్ ప్రస్తుతం లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్చే పనిలో ఉన్నాడు. అయితే సాహోతో ప్రభాస్ కి నిరాశ మిగిల్చిన సుజిత్ కి చిరంజీవి అవకాశం ఎందుకు ఇచ్చాడన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలో కలిగింది. యంగ్ డైరెక్టర్ చిరంజీవిని హ్యాండిల్ చేయగలడా అన్న సందేహాలు మొదలయ్యాయి.అదీగాక ఒక ఫ్లాప్ డైరెక్టర్ చిరంజీవి అవకాశం ఎందుకు ఇచ్చాడన్నది ఆసక్తిగా మారింది. అయితే సాహో సినిమా స్టైలిష్ మేకింగ్ నచ్చే చిరంజీవి సుజిత్ ని ఎంపిక చేసుకున్నాడని అన్నారు. అయితే తాజా సమాచార ప్రకారం ఈ అవకాశం సుజిత్ కి రికమెండేషన వల్ల వచ్చిందని అంటున్నారు. సాహో నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి, రామ్ చరణ్ లు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులట.

విక్రమ్ రెడ్డి ప్రోద్భలంతోనే సుజిత్ కి లూసిఫర్ రీమేక్ అప్పగించినట్లు చెబుతున్నారు. ఏదేతైనేం సుజిత్ కి మంచి అవకాశం లభించింది. ప్రస్తుతం సుజిత్ లూసిఫర్ స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ద్వారా చిరంజీవికి మంచి హిట్ ఇచ్చి తనని తాను నిరూపించుకుంటాడా లేదా చూడాలి. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి చిరంజీవితో అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా లేదా చూడాలి.