ముద్దుతో పిచ్చెక్కిస్తున్న సన్నీ లియోన్.. అర్ధరాత్రి అదిరిపోయే ఆఫర్స్

మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. శృంగార తారగా కెరీర్‌లో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చిరవకు వెండితెరపై కాలుమోపిన ఈ సుందరి, కేవలం వెండితెరనే కాకుండా సోషల్ మీడియా లోనూ సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు టచ్ లోకి వస్తూ తనకు సంబంధించి అన్ని విశేషాలను నెటిజన్లకు తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రకటించిన ఓ ఆఫర్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. వివరాల్లోకి పోతే.. శృంగార తార మొదలుకొని వెండితెర నటి వరకూ అన్నింటా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ పలు రంగాల్లో రాణిస్తూ వస్తోంది.

వ్యాపారం, సామాజిక సేవ అన్నింటా ముందుంటోంది. సినీ రంగంలో రాణిస్తూనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సొంత వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే సన్నీలియోన్ కూడా వెళుతూ హవా కొనసాగిస్తోంది. ‘స్టార్ స్ట్రక్ బై సన్నీలియోన్’ పేరిట సౌందర్య సాధనాల స్టోర్ నిర్వహిస్తోంది సన్నీలియోన్. suncitystore.com అనే వెబ్ పోర్టల్ ద్వారా లిప్ స్టిక్, ఐ డిఫైనర్, మేకప్ కిట్, ఫర్‌ఫ్యూమ్ వంటి ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా అమ్ముతూ లాభాలు గడిస్తోంది. అయితే ఎలాగూ సెలబ్రిటీ హోదా ఉంది కదా అని తన ఉత్పత్తులను తానే స్వయంగా ప్రమోట్ చేసుకుంటోంది సన్నీ.
ఇది దీపావళి సమయం. ఈ పండుగ వేళ బడా వ్యాపారవేత్తలంతా పెద్ద ఎత్తున ఆఫర్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు. సరిగ్గా అదే బాటలో వెళ్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది సన్నీ. suncitystore.com అనే వెబ్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసే వస్తువులకు 50శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది సన్నీలియోన్. సోమవారం అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు అనగా అక్టోబరు 15, 16 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుపుతూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిందీ ముద్దుగుమ్మ.

ఈ విషయాన్ని తెలిపిన సన్నీలియోన్ ఇది నా గిఫ్ట్ అని పేర్కొంటూ కిస్ చేసింది. దీంతో అమ్మడి ప్రొడక్ట్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎగబడుతున్నారు నెటిజన్లు. శృంగారం, సినిమాలే కాదు వ్యాపారంలోను అమ్మడి తీరు భలేవుందే! అంటూ సన్నీలియోన్ పోస్ట్ చేసిన వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు జనం. ప్రస్తుతం సన్నీలియోన్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్ అనే వెబ్ సీరీస్ చేస్తోంది. ఇందులో సన్నీలియోన్ తో పాటుగా ఇందులో నవదీప్ కూడా నటిస్తున్నాడు. సన్నీలియోన్ సెట్స్‌లో చాలా ఫన్నీగా అందరితో సరదాగా ఉటుందని, ఒక్కసారి సన్నీతో పరిచయమైతే ఆమెతో గడిపే సమయం తెలియకుండానే అయిపోతుందని నవదీప్ చెప్పడం విశేషం.