సుడిగాలి సుధీర్ హవా మామూలుగా లేదుగా…

ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సుధీర్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎలా వచ్చాం.. ఎక్కడ్నుంచి వచ్చాం.. అనేది కాదు ఎలా ఎదిగాం.. ప్రస్తుతం మనమెక్కడున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సుధీర్ కూడా ఇదే చేసి చూపించాడు. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు తెరకు వచ్చారు.. వెళ్లిపోయారు కానీ కొందరు మాత్రమే అక్కడే సెటిల్ అయిపోయారు.

 

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు సుడిగాలి సుధీర్. ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూనే ఉన్నాడు.బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న కమెడియన్స్‌లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. ఈ మధ్యే సాఫ్ట్‌‌వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా. మిగిలిన సినిమాల్లో కూడా చిన్నచిన్న పాత్రలు చేసాడు ఈయన. ఇక ఇప్పుడు ఈయన డేట్స్ హాట్ కేక్.. 30 రోజులు ఫుల్ బిజీగానే ఉన్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఇంకా చాలా షోస్ చేస్తున్నాడు సుధీర్. దీనికి తోడు సినిమాలు కూడా చేస్తున్నాడు. దాంతో ఆస్తులు కూడా బాగానే పోగేసుకుంటున్నాడు ఈయన.
సుడిగాలి సుధీర్ ఆస్తి విలువ ఎంతుంది అని తెలుసుకోడానికి అభిమానులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఈయన ప్రస్తుత ఆస్తి లెక్కలు కడితే దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తుంది.

 

ఏడాదికి కనీసం 25 నుంచి 35 లక్షలు మధ్యలో సంపాదిస్తున్నాడు సుధీర్. అందులో జబర్దస్త్ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ కూడా ఉన్నాయి. దానికితోడు సినిమాలు కూడా చేస్తుండటంతో సుధీర్ బాగానే వెనకేసుకుంటున్నాడు. ఏదేమైనా కూడా చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం కూడా మాటలు కాదు.