సుధీర్ నా తండ్రిలాంటి వాడు.. ఈ మాటన్నది ఏవరో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

బుల్లితెరపై ప్రస్తుతానికి అందరిని అలరిస్తున్నటువంటి జంట అంటే సుడిగాలి సుదీర్ మరియు విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు. కాగా వీరిద్దరూ కలిసి చేస్తున్నటువంటి పోవే పోరా కార్యక్రమం ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీరిద్దరి కెమిస్ట్రీ అంటే దాదాపుగా ఇష్టపడనివారెవరు ఉండవు. అంతలా వీరి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. అయితే ఇటీవల విష్ణు ప్రియా ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ వారికీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…

సుడిగాలి సుదీర్ తనకు తండ్రి సమానుడని, తనని ఒక తండ్రి లాగ చూసుకుంటాడని, అంతేకూండా తన తల్లి తరువాత అంత ప్రేమగా చూసుకునేది ఒక్క సుదీర్ మాత్రమే అని చెప్పేసింది. అయితే ఒక్కసారిగా విష్ణు ప్రియా ఇలాంటి బాంబ్ పేల్చడంతో అభిమానులు అందరు కూడా బాధ పడుతున్నారని సమాచారం. అయితే ఇకనుండి రానున్న షో లో వీరి కెమిస్ట్రీ ఇలాగె ఉంటుందా, లేక ఏమైనా మార్పులు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.