బడా నిర్మాతపై గట్టిగానే అలిగిన స్టార్ హీరోయిన్.. అసలు కారణం ఇదేనా..?

ఎప్పుడు చూసినా ఆయన చుట్టూనే దీపం చుట్టూ తిరిగే పురుగులా తిరుగుతోంది.. ఆయన నిర్మించే ప్లాప్ సినిమాలన్నిట్లో హీరోయిన్ తనే.. ఈ అమ్మడికి వేరే ఎవరూ అవకాశాలివ్వరు.. ఏ ఇతర సినిమాల్లోనూ నటించిందేమీ లేదు. అయినా ఇంకా టాలీవుడ్ లోనే తచ్చాడుతూ ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉంది. అప్పుడప్పుడు అవార్డ్ ఫంక్షన్లు.. ఈవెంట్లలో స్టేజీపై పెర్ఫామెన్సులతో అదరగొడుతుంటుంది. మొన్న ఆ మధ్య రామానాయుడు స్టూడియోలో పబ్లిసిటీ చేసిన సినిమాకి తాను నటించకపోయినా ప్రమోషన్ చేసేందుకు ఆ నిర్మాత కోసం వచ్చింది.

అది డిజాస్టర్ రిజల్ట్ అందుకోవడంతో ఐరెన్ లెగ్ ప్రమోషన్ అంటూ వాడి వేడిగా చర్చ సాగింది. ఇంత జరిగినా.. ఇప్పటికీ ఆ నిర్మాత కాంపౌండ్ ని ఈ అమ్మడు విడిచిపెట్టడం లేదట. ప్రస్తుతం సదరు నిర్మాత సూపర్ స్టార్లతో అన్నీ భారీ చిత్రాలే తీస్తున్నారు. మరి అందులో ఐటెమ్ నంబర్ ఛాన్స్ అయినా ఇవ్వడా అంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే వాటిలోనూ అగ్ర కథానాయికనే ఎంపిక చేసుకుని షాకిచ్చాడట. సదరు సెకండ్ టైర్ బ్యూటీకి అవకాశాలివ్వకపోవడంతో పాపం ఆ నిర్మాతపై అలిగిందట. ఇంతకీ ఎవరా టాప్ రేంజ్ నిర్మాత? ఎవరా ముంబై హాట్ బ్యూటీ? అంటూ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ఇంతకీ ఎవరో కనిపెట్టగలరా?