స్టార్ హీరో కొడుకు లవ్ అఫైర్.. మొత్తం బట్టబయలు

ఒకప్పుడు హీరోల.. హీరోయిన్స్ లవ్ అఫైర్స్ గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వచ్చేవి. కాని ఈమద్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు మరియు ఫిల్మ్ మేకర్స్ వారసులకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే ఇద్దరు స్టార్ హీరోల కిడ్స్ లవ్ అఫైర్స్ వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ జాబితాలో మరో స్టార్ హీరో తనయుడు కూడా చేరాడు.బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్న హీరో సునీల్ శెట్టి. ఈయన తనయుడు ఆహాన్ శెట్టి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

మన తెలుగు సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ హిందీ రీమేక్ తో ఆహాన్ శెట్టి హిందీ ప్రేక్షకులకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆహాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండానే అప్పుడే ప్రేమలో మునిగి తేలుతున్నాడు. గత కొంత కాలంగా హిందీ మీడియాలో ఆహాన్ శెట్టి ఇంకా వ్యాపారవేత్త కూతురు తన్యా ష్రాఫ్ లు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను వారిద్దరు కూడా కొట్టి పారేయలేదు కాని ఒప్పుకోలేదు. కాని తాజాగా ఇద్దరు ఇటలీలో విహార యాత్రకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా వారిద్దరు కూడా తమ ప్రేమ వ్యవహారంను సోషల్ మీడియా ద్వారా ఒప్పుకున్నారు. నీవు నా జీవితంకు పిల్లర్ వంటివాడివి అంటూ ఆహాన్ గురించి వ్యాఖ్యనించగా.. అందుకు ఆహాన్ స్పందిస్తూ ఐ లవ్ యూ అంటూ సమాధానం ఇచ్చాడు.

దీంతో ఇన్ని రోజులుగా పుకార్లుగా ఉన్న లవ్ అఫైర్ కాస్త అధికారికం అయ్యింది. అయితే ఆహాన్ అప్పుడే లవ్ ఏంటీ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అతడు చాలా సాధించాల్సి ఉంది. ఇంకాస్త కాలం లవ్ కు దూరంగా ఉంటే బెటర్ అంటూ సలహాలు ఇస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.