కీరవాణికి, రాజమౌళి నచ్చనిది ఇదేనా..

తెలుగులో సుధీర్ఘకాలం పాటు సంగీత దర్శకులుగా కొనసాగుతున్న వాళ్లలో కీరవాణి ప్రథముడు. ఆయన తర్వాత వచ్చిన ఎందరో సంగీత దర్శకులు కాలానికి తగ్గట్టుగా పనిచేయకపోవడంతో ఔట్ డేట్ అయిపోయారు. అయితే ఒక్క కీరవాణి మాత్రం శ్రోతల నాడీని బాగానే పట్టగలిగాడు. కాలానుగుణంగా సినిమాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ, తాను కూడా కాలానికి తగిన విధంగా మారుతూ సరికొత్త సంగీతాన్ని సృష్టించగలుగుతున్నాడు.అందుకే ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నా ఇంకా నిలబడగలుగుతున్నాడు. కొత్తవారికి తానేమీ తీసిపోకుండా వరల్డ్ క్లాస్ మ్యూజిక్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు.

అయితే రాజమౌళి ఇప్పటి వరకు చాలా మంది దర్శకుల వద్ద పనిచేశారు. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. కానీ ఆయన రాజమౌళితో చేసిన చిత్రాలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకూ రాజమౌళి చేసిన ప్రతీ సినిమాకీ కీరవాణియే మ్యూజిక్ డైరెక్టర్.కుటుంబ పరంగా వారిద్దరు అన్నదమ్ములు. రాజమౌళి చేసే సినిమాలో ఆయన కుటుంబం పాత్ర చాలా ఉంటుంది. అయితే కీరవాణి రాజమౌళికి చాలా మంచి హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ కి కూడా కీరవాణి సంగీతం ఇస్తున్నాడు. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. అయితే లాక్డౌన్ ఉన్న ఇంట్లోనే ఉన్న కీరవాణి ఒకానొక ఇంటర్వ్యూలో రాజమౌళిలో తనకి నచ్చని అంశాన్ని ప్రస్తావించాడు.ముందుగా నచ్చిన విషయాల గురించి చెబుతూ, అతని ఏకాగ్రత అంటే చాలా ఇష్టం.

ఏదైనా పట్టుకుంటే అసలు వదలడు, అంత ఏకాగ్రతతో పనిచేస్తాడని చెప్పాడు. ఇక నచ్చని విషయాల గురించి మాట్లాడితే రాజమౌళి ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తారట. వాటిని చూడడం వల్ల రాజమౌళి సినిమా చూడడం కుదరట్లేదట. అదీ గాక తాను సజెస్ట్ చేసిన సినిమాలు చూస్తానని చెప్పి అలానే మర్చిపోతాడట. ఇలా సరదాగా రాజమౌళిలో తనకి నచ్చని విషయాలను చెప్పుకొచ్చాడు కీరవాణి.