శ్రీముఖి కేరీర్ కు ఇబ్బందిగా మారుతున్న బిగ్ బాస్.. అసలేం జరిగింది..?

బిగ్‌బాస్‌ గేమ్‌లో అసలైన క్యారెక్టర్స్‌ని జనాలకి చూపించి వారినే జడ్జి చేయమని వదిలేయడం షో అసలు ఉద్దేశం. అయితే స్టార్‌ కంటెస్టులతో ముందుగానే ఇన్ని వారాలకి ఒప్పందాలు మాట్లాడేసుకుని వారిని ఎలాగైనా షోలో వుండేట్టు చేయడం తెలుగు బిగ్‌బాస్‌ వారి నిర్వాకం. గత సీజన్‌లోనే బెడిసికొట్టిన ఈ ఫార్ములాని ఈసారి కూడా వాడేస్తున్నారు. అయితే తమకి కావాల్సిన కంటెస్టులని బ్యాడ్‌గా చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇంతవరకు శ్రీముఖి తన నిజ స్వరూపాన్ని పలుమార్లు బయట పెట్టుకున్నా కానీ నాగార్జునతో ఒక్కసారి కూడా ఆమెని ఒక్క మాట కూడా అనిపించలేదు. దీంతో బిగ్‌బాస్‌ పక్షపాత బుద్ధి ప్రేక్షకులకి అర్థమైపోయింది. దాంతో శ్రీముఖి టార్గెట్‌ చేసే వారికి ఆటోమేటిగ్గా ఆదరణ పెరుగుతోంది. రాహుల్‌ సిప్లిగంజ్‌కి ఇప్పుడు అందరి కంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అలాగే శ్రీముఖిని ఎదిరిస్తోన్న పునర్నవికి కూడా శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. నానాటికీ పెరుగుతోన్న యాంటీ వేవ్‌ ఆ తర్వాత శ్రీముఖి కెరియర్‌కి ఇబ్బందిగా మారే అవకాశముంది.

బిగ్‌బాస్‌ నిర్వాకం వల్ల తేజస్వి, గీత మాధురి, బాబు గోగినేని లాంటి వాళ్లు కనిపించకుండా పోయారు. తనీష్‌లాంటి వారిపై పూర్తి యాంటీ ఏర్పడింది. చూస్తోంటే ఈ యాంటీ వేవ్‌ శ్రీముఖి అసలు కెరియర్‌కి ఎర్త్‌ పెట్టేలా వుంది. ఇదే పద్ధతి కొనసాగితే ఈమాత్రం పాపులర్‌ ఫేస్‌లు కూడా ఈ హౌస్‌లో అడుగు పెట్టడానికి నిరాకరించే ప్రమాదముంది.