రోజు రోజుకు హాట్ హాట్ గా శ్రీముఖి.. అసలు రీజన్ ఇదేనా..!

ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై తన ఆకట్టుకునే యాంకరింగ్ స్టయిల్ తో వీక్షకుల నుండి మంచి ఫాలోయింగ్ మరియు క్రేజ్ సంపాదించిన నేటితరం యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. ఒకప్పుడు అక్కడక్కడా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన శ్రీముఖి, మెల్లగా టెలివిజన్ ఛానల్స్ లో బిజీ అయింది. అయితే ఆమెకు బాగా పేరు తీసుకువచ్చింది మాత్రం, ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న పటాస్ అనే క్రేజీ షో ద్వారానే అని చెప్పాలి. యూత్ మరియు లేడీస్ ని విపరీతంగా ఆకర్షిస్తోన్న ఈ షోలో మరొక యాంకర్ రవితో కలిసి శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు.

ఒక రకంగా ఆమె వల్లనే ఆ షో అంత సక్సెస్ సాధించిందని అంటున్నారు విశ్లేషకులు. తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ మరియు యాంకరింగ్ స్టైల్ తో వీక్షకులను మంత్రముగ్దులను చేసే శ్రీముఖి, త్వరలో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆమెను తమ షోలో తీసుకోవడం కోసం బిగ్ బాస్ టీమ్ ఇటీవల ఆమెను కలవడం, ఆమె అందుకు సమ్మతించడం కూడా జరిగిపోయిందట. అందుకే ఆమె పటాస్ షో నుండి కొద్దిరోజుల క్రితం బయటకు రావడం జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇక ప్రస్తుతం కొద్దిరోజుల నుండి శ్రీముఖి రకరకాల స్టైల్స్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటుండడంతో, ఎన్నడూ లేని విధంగా ఆమె ఎందుకు ఇంతలా ఫోటో షూట్స్ చేస్తున్నారు అనే విషయమై నేడు ఒక వార్త ప్రచారం అవుతోంది.

అదేమిటంటే, ఆమె త్వరలో బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నందున, ఇకపై అక్కడ ఫోన్లు, కెమెరాలు వంటివి అందుబాటులో ఉండవు, అదీకాక దాదాపుగా 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లోనే గడపడం వలన, తన ఇంట్లో వాళ్ళు మరియు ఫ్యాన్స్ తనను చూసే వీలుందడు కనుక, ఈ ఫోటో షూట్స్ ద్వారా ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ప్రస్తుతం రకరకాల స్టయిల్స్ లో ఫోటోషూట్స్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి ప్రస్తుతం కొన్ని మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు మాత్రం వెల్లడి కావాల్సివుంది…..!!