భానుశ్రీ కూడా శ్రీరెడ్డిని కావాలనే టార్గేట్ చేసిందా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్దీ కాలంలోనే అందరికి సుపరిచితురాలైనటువంటి ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ వివాదం పై అంతలా ఒక రకమైన సంచలనాలను సృష్టించిందని చెప్పాలి. కాగా గత కొద్దీ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు చాలా దారుణంగా అన్యాయం జరుగుతుందని ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి ఒక సెలెబ్రిటీ గా మారింది అనే చెప్పాలి. కాగా ఈమెపై కూడా చాలా మంది ప్రముఖులు విమర్శలు, ట్రోల్స్, చేయడం జరిగింది. కాగా తాజాగా ఒక తెలుగు యాంకర్ భానుశ్రీ కూడా ఇపుడు శ్రీరెడ్డి టార్గెట్ గా కొన్ని సంచలనాలను సృష్టించింది.

కాగా తాజాగా భాను శ్రీ “ఏడు చేపల కథ” చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని చాల బోల్డ్ గా తెరకెక్కించాడు దర్శకుడు ఎస్ జె చైతన్య. కాగా ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో భాను సేమ్ శ్రీరెడీ లాగే కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఒక సన్నివేశంలో ఏకంగా శ్రీ రెడ్డి మాదిరే బట్టలిప్పేసి, శ్రీరెడ్డి లాగే హావభావాలు పలికించింది. దానికితోడు శ్రీరెడ్డి లాగే జుట్టు విరబూసుకుని, నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుని ధర్నాకి దిగుతుంది. కాలేజీ ఆ సన్నివేశంలో ఒక మీడియా వ్యక్తి భానుశ్రీ తో మాట్లాడుతూ… మీరు పెద్ద బొట్టు పెట్టుకుంటారా.. జుట్టు ఇలాగే విరబూసుకుంటారా.. అని ప్రశ్నించగా, ఈ బొట్టు, జుట్టు పెద్ద ఫేమస్ అనే సమాధానం చెప్తుంది భాను శ్రీ. ఇదంతా చూస్తే శ్రీరెడ్డి ని కావాలనే టార్గెట్ చేశారని అర్థమవుతుంది. కానీ ఈ విషయంలో శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.