నీ వల్ల ఒరిగిందేమీ లేదు.. చిరుపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

వివాదస్పద నటి శ్రీరెడ్డి మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల బిగ్‌బాస్ షోలో టైటిల్ ఇవ్వడానికి వచ్చిన చిరంజీవి స్టేజ్‌పై అందరి కంటెస్టెంట్ల మాదిరిగానే తమన్నా సిమ్హాద్రిని కూడా పొగుడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమన్నా వెరీ డైనమిక్ గర్ల్. తేడాలొస్తే చీల్చి చెండాడుతావ్ ప్రేమిస్తే మనసు ఇచ్చేస్తావ్ అంటూ నువ్వు అప్పటి వరకూ ఎవర్ని సపోర్ట్ చేసినా సరే వాళ్లు మంచి వ్యక్తుల్ని విమర్శిస్తే ఆ ఫ్రెండ్ షిప్‌ని కూడా కట్ చేసుకుని బయటకు వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే ధైర్యం నీలో ఉందని,

దానిని నేను అభినందిస్తున్నా అంటూ ఇది నీకూ నాకూ మాత్రమే అర్ధమై ఉంటుందని అనడంతో ఈ వ్యాఖ్యలు శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసినవే అని అందరికి తెలిసిపోయింది. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీరెడ్డి చిరంజీవిపై రెచ్చిపోయి మాట్లాడింది. మొదట ఉపాసన గురుంచి మాట్లాడుతూ మీ ఫ్యామీలీలో ఉపాసన ఉత్తమురాలని, మీ ఫ్యామీలీలో నాకు గౌరవమున్న ఒకే ఒక వ్యక్తి ఉపాసన అని, మీలాంటి మనస్థత్వాలు ఉన్న కుటుంబంలోకి ఆమె రావల్సింది కాదని అన్నారు.

అయితే తమ్మన్నా సిమ్హాద్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని, మేము ఇండస్ట్రీలో జరిగే తప్పులను ఎత్తి చూపినప్పుడు మీకు మేము కనిపించలేదు అని, కేవలం మేము పవన్ కళ్యాణ్‌పై మాట్లాడిన మాటలను మనసులో పెట్టుకుని మీరు ఎంత వరకు మాపై కక్ష్య పెంచుకున్నారన్నది తేలిపోయిందని అన్నారు.  అయితే మీరు రాజకీయాలలోకి వచ్చి పెద్దగా ప్రజలకి ఒరిగింది ఏమీ లేదని మీరు ఎంపీ తీసుకుని ఎంత తీసుకున్నారో అందరికి తెలుసునని అన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎవరి చేతుల్లో ఉందో తెలుసని, చిరంజీవి చెప్పిన ప్రతి దానికి నాగార్జున తానా తందానా అనడం మామూలేనని మాట్లాడుతూ ఒక వీడియోనే రిలీజ్ చేసింది.