వాళ్ళది సేవే.. వ్యభిచారం చేస్తే తప్పేంటి..? శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి మరొకసారి సంచలనమైన వాఖ్యలు చేసింది. ప్రముఖ రాజకీయ నాయకులని, సినీ ప్రముఖులను అందరిని కూడా టార్గెట్ చేసి వారిపై విమర్శనాత్మకమైన పోస్టులు పెడుతూ కాలం వెళ్లబోచుకుంటుంది. కాగా శ్రీరెడ్డి పెట్టె పోస్టులల్లో బూతు వాఖ్యలు ఎక్కువగా ఉండటంతో అవి త్వరగానే వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే శ్రీరెడ్డి ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేసే మరీ వారిపై సంచలన వాఖ్యలు చేసింది. అయితే తాజాగా విశాఖలో కంచరపాలెంలో సెక్స్ రాకెట్‌ ముఠా ని బట్టబయలు చేసిన పోలీసులపై సంచలన వాఖ్యతలు చేసింది శ్రీరెడ్డి.అయితే పోలీసులు అకస్మాత్తుగా నిర్వహించిన రైడ్ ఓ ముగ్గురు మహిళలు, ఇద్దరు యువతులు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు.

అయితే ఈ విషయంలో శ్రీరెడ్డి మధ్యలో కలుగజేసుకొని, వ్యభిచారం అనేది ఒక సమాజ సేవ లాంటిది అని, అక్కడితో ఆగకుండా వేశ్యల్ని దేవతలతో పోలుస్తూ పేస్ బుక్ ద్వారా ఒక దారుణమైన పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. “వేశ్యలు అనేవాళ్లు లేకపోతే.. మీ చిన్నారి కూతుళ్లకు భద్రత లేదు. వాళ్లని ఆ పని చేయనీయండి. కనీసం మగాళ్లు జంతువులుగా మారకుండా ఉంటారు. వేశ్యలంటే దేవతలు. ఎందుకంటే వాళ్లు ఈ రకంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్‌ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు” అంటూ తన పోస్టు ద్వారా హెచ్చరించింది శ్రీరెడ్డి. అయితే ఈ వ్యభిచారం చేస్తున్న వారిలో అటు మహిళలు, మగవాళ్ళు అందరు ఆనందంగానే ఉన్నారు కదా.. మధ్యలో మీరెందుకు ఆలా తప్పు పడుతున్నారని శ్రీరెడ్డి ప్రశ్నించింది.