చిరంజీవి కీ సూటి ప్రశ్న వేసిన శ్రీరెడ్డి

ఒకప్పుడు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదంపై శ్రీ రెడ్డి ఎంత రచ్చ చేసిందో చెప్పనవసరం లేదు.అయితే మొన్న జరిగినటువంటి మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ స్టేజి మీద నుంచి దిగిపోయి తన నిరసన వ్యక్తం చేసి చేశాడు.ఇందుకుగాను మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు మరియు పలువురు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అయితే ఈ విషయంపై తాజాగా శ్రీ రెడ్డి స్పందించారు.

 

ఇందులో భాగంగా నేను ఇంతకు ముందే చెప్పాను జీవితా రాజశేఖర్ అసలు మా అసోసియేషన్ కి అస్సలు సూట్ అవ్వరని కానీ కొంతమంది చిత్ర పరిశ్రమలోని సినీ పెద్దలు పనిగట్టుకుని మరీ వారిని గెలిపించారని అన్నారు.అంతే గాక మొన్న ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ స్టేజి మీద కూర్చున్న వాళ్లంతా రేపోమాపో హరీమనేవాళ్ళని కానీ వాళ్లు పోయేటప్పుడు మనం ఎంత మందిని బాధ పెట్టామని ఆలోచన మీకు వస్తే నేను చాలా సంతోషిస్తానని శ్రీ రెడ్డి అభిప్రాయపడ్డారు.అంతేగాక మెగాస్టార్ చిరంజీవి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీ రెడ్డి.ఇందులో భాగంగా ఇప్పటివరకు తనకు మా అసోసియేషన్ లో మెంబెర్ గా కార్డు ఎందుకు జారీ చేయలేదో కనీసం ఇప్పుడైనా ఒక సినీ పరిశ్రమ పెద్దగా తనకు చెప్పాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా గతంలో డాక్టర్ రాజశేఖర్, బాలసుబ్రమణ్యం, సుమన్, స్వర్గీయ ఉదయ్ కుమార్ వంటి వాళ్లకి అవకాశాలు లేకుండా సినీ ఇండస్ట్రీలో తొక్కేశారనే ఆరోపణలు ఇప్పటికీ మీపై ఉన్నాయని వాటికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

 

అంతేగాక సినీ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా కేవలం మీ కుటుంబీకుల మాత్రమే ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ సినిమాలు చూడాలంటూ వారి భావాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు.అయితే ఇది ఇలా ఉండగా మొన్న జరిగినటువంటి సంఘటన ఆధారంగా శ్రీ రెడ్డి ప్రస్తుతం జీవిత రాజశేఖర్ ని సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని అందుకే ఇప్పుడు శ్రీ రెడ్డి వారి వైపు మాట్లాడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.