సోనాలి బింద్రే ఎమోషనల్ ప్రేమ లేఖ.. ఇది చూస్తే షాకవ్వాల్సిందే..?

‘గతేడాది ఇదే రోజున నేను న్యూయార్క్ హాస్పిటల్‌లో ఉన్నాను. అప్పటి నుంచి మా జీవితాలు క్యాన్సర్‌కు ముందు క్యాన్సర్‌కు తర్వాతగా మారిపోయాయి. కాలం గడిచేకొద్ది నా జీవితంలో కొత్త విషయాలు ప్రయత్నించాలన్న ఆత్రుత ఎక్కువైపోయింది. మా 17వ పెళ్లి రోజు సందర్భంగా నా భర్త గోల్డీతో కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లాలనుకున్నాను. ఇప్పటివరకు గోల్డీ నన్ను ఎప్పుడూ రోడ్ ట్రిప్స్‌కు తీసుకువెళ్లలేదు. కానీ ఈ సారి మాత్రం నేను అడగ్గానే నన్ను తీసుకువెళ్లాడు. క్యాన్సర్ మా జీవితాలను మార్చేసింది. నా భర్త అన్ని విషయాలు పక్కనబెట్టేసి కేవలం నా కోసమే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

హ్యాపీ యానివర్సరీ గోల్డీ.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తు్న్నానో నువ్వు ఊహించలేవు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా నా బలంగా నిలిచినందుకు థ్యాంక్యూ’ అని వెల్లడించారు సోనాలి.ఆమెకు క్యాన్సర్ సోకిందని తెలిసి సోనాలి కుటుంబం చాలా కుమిలిపోయింది. బతికే ఛాన్స్ 30శాతమే ఉందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో వారికే అర్థంకాలేదు. కానీ సోనాలి ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ దేవుడిపై తన కుటుంబంపై భారం వేసింది. ఏడాది పాటు న్యూయార్క్లో చికిత్స చేయించుకుని క్యాన్సర్ నుంచి బయటపడింది. తెలుగులో ‘మురారి’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘మన్మథుడు’ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సోనాలి. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహల్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. పేరు రణ్‌వీర్ బెహల్. పెళ్లయ్యాక సోనాలి సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. డ్యా్న్స్ రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ ఉండేవారు.