ఏ మాత్రం తగ్గని సితారా ఘట్టమనేని, మహేష్ కి పోటిగా…

అవ్వడానిక సూపర్ స్టార్ కూతురైనా .. ఆ తండ్రి స్టార్ డమ్ కి రీచ్ అయ్యేలానే ఉంది ఈ సీతాపాప క్రేజ్. టాలీవుడ్ లో స్టార్ హీరోహీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంది ఈ అమ్మాయి గారి సోషల్ మీడియా ఫాలోయింగ్. అందుకే తన అభిమానుల కోసం తనే సొంతగా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండడానికి ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మహేష్ కూతురు సితార.మహేష్ ముద్దుల కూతురిగా, సీతాపాప గా సితారకు ఫుల్ క్రేజ్ ఉంది. మహేష్, నమ్రత కూడా సోషల్ మీడియాని బాగా ఫాలోఅవుతారు. అయితే ఈ సోషల్ మీడియాలో తమ అకౌంట్స్ ట్విట్టర్, ఇన్ స్టా ల్లో సితార వీడియోస్, ఫోటోస్ పెడుతుంటారు. మరి ఇంత క్యూట్ గా ఉండే సితార ను చూసి అభిమానులు మురిసిపోకుండా ఉంటారా. అందుకే సీతాపాపకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

మహేష్, నమ్రత పోస్ట్ చేసే వాటికి వేలల్లో, లక్షల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఫ్యాన్స్ కూడా సితార క్యూట్ వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పటివరకూ తనఫోటోస్ ని, వీడియోస్ ని మహేష్, నమ్రత ప్రొఫైల్స్ లో చూడాల్సి వచ్చేది . కానీ ఇప్పుడలా కాదు..డైరెక్ట్ గా ఏం అడగాలన్నా సితార ను అడగొచ్చు. ఎందుకంటే సితార ఘట్టమనేని ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.సితార ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో.. దాదాపు 15 వేలమంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అంతేకాదు .. జస్ట్ 7 సంవత్సరాల వయసులో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న స్టార్ కిడ్ గా కొత్తట్రెండ్ క్రియేట్ చేసింది సితార. అకౌంట్ క్రియేట్ చేసిందో లేదో.. క్యూట్ గా 3 ఫోటోలు అప్ లోడ్ చేసింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో మహేష్, నమ్రత సితార చిన్నప్పటి వీడియోలు పోస్ట్ చేశారు. సితార మాత్రం తన ఇప్పటిఫోటోలే పోస్ట్ చేసింది.

టెడ్డీ బేక్ బ్యాక్ గ్రౌండ్ తో ఒకటి, తన బెస్ట్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోతో పాటు యోగా చేస్తూ మరో ఫోటో పోస్ట్ చేసింది. రోజూ మా అమ్మ 5 నిమిషాలుకళ్‌లుమూసుకుని కూచోమంటుంది.. కానీ నాకు ఆటైమ్ లో కళ్లముందు ఐస్ క్రీమ్స్, రెయిన్ బోస్ కనిపిస్తూ ఉంటాయని యోగా ఫోటోగురించి సరదాగాచెబుతోంది సూపర్ స్టార్ కూతురు సితార. సో తొందరలోనే తండ్రిని మించి ఫాలోయింగ్ సంపాదించుకుంటుందన్నమాట ఈ స్టార్ కిడ్.