శ్రీముఖికి బిగ్ షాక్.. రాహుల్ గట్టి దెబ్బేసాడుగా..?

ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా వారు విడుదల చేసారు.అయితే ఈ వీడియోలో ఇప్పుడు హౌస్ లో మిగిలి ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ మధ్య ఆధిపత్య పోరు నంబర్స్ వారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.అయితే వీరిలో బాబా నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.అయితే ఈ ప్రోమో మాత్రం రాహుల్ వర్సెస్ శ్రీముఖి అని చెప్పాలి.ఒకరి మీద ఒకరు గట్టిగా ఫైర్ అయ్యారు.

రాహుల్ ను అరవొద్దు టోన్ తగ్గించు అంటూ శ్రీముఖి అలాగే శ్రీముఖికి కూడా రాహుల్ ఒకరికొకరు స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చుకున్నారు.దీనితో బిగ్ బాస్ వీక్షకుల్లో కాస్త ఉత్కంఠ పెరిగింది.అయితే ఈ ఇద్దరిలో మాత్రం నెటిజన్స్ ఒకరి వైపే స్ట్రాంగ్ గా నిలబడ్డారు.సోషల్ మీడియాలో ఎంతో స్ట్రాంగ్ ఉండే కంటెస్టెంట్ గా పేరు ఉన్న శ్రీముఖిని మించి ఈ ఒక్క ప్రోమోతో నెటిజన్స్ రాహుల్ కు చాలా గట్టి సపోర్ట్ ఇస్తున్నారు.శ్రీముఖియే కావాలని ఏదో చేసి ఉంటుందని తాము మాత్రం ఈ విషయంలో రాహుల్ తోనే ఉన్నామని చెప్తున్నారు.