సిల్క్ స్మితకు ఆత్మహత్యకు అసలు కారణం ఇదేనా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం

సిల్క్ స్మిత 90 వ దశకంలో ఈ పేరు ఒక సంచలనం. శృంగార తారగా పేరు పొందిన సిల్క్ స్మిత తన జీవితం విషాదంతోముగిసిపోయింది. అయితే చాలా మందికి సిల్క్ స్మిత ఆత్మహత్యకు కారణాలు తెలియవు. అయితే అప్పటి సినీ పరిశోధకులు రామారావు చెబుతూ సిల్క్ స్మితను నిర్మాతలు మధ్యం తాగించి శారీరకంగా వాడుకునే వారని చెప్పుకొచ్చారు. దీనితో సిల్క్ స్మిత మనో వేధనను భరించలేక ఆత్మహత్యకు పాల్పడివుంటుందని చెప్పారు. అయితే తాజాగా సిల్క్ స్మిత సూసైడ్‌కి సంబంధించిన ప్రస్తావన తెస్తూ షాకింగ్ సంగతులు చెప్పాడు నటుడు వీ రవిచంద్రన్. కన్నడ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వీ రవిచంద్రన్.

మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరొందిన ఆయనకు సిల్క్ స్మితతో మంచి స్నేహం ఉండేది.తాజాగా రవి చంద్రన్ సిల్క్ స్మిత గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కన్నడ మీడియా సంస్థతో ముచ్చటించిన ఆయన.. సిల్క్ స్మిత సూసైడ్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. 1992లో సిల్క్ స్మిత, వీ రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య స్నేహం ముదిరింది. తనతో చనిపోయే ముందు రోజు వరకూ సిల్క్ స్మిత చాలా స్నేహంగా ఉండేదని వీ రవిచంద్రన్ తెలిపాడు. ఆమె తనతో ఎంతో గౌరవంగా ఉండేదని, అలాగే తానూ ఆమె పట్ల గౌరవంగా మెదిలేవాడినని అన్నాడు.రవిచంద్రన్ ఇంకా చెబుతూ సిల్క్ స్మిత చనిపోయే ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పుకొచ్చారు. బహుశా ఆమె తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. అది సాధ్యం కాలేదని చెప్పాడు. తాను ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా సిల్క్ స్మిత నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ఏదో రొటీన్ కాల్ అని, ఊరికే చేస్తుందేమో అని తాను అనుకున్నానని చెప్పాడు రవిచంద్రన్.

1996 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన తనకు సిల్క్ స్మిత కాల్ చేసిందని ఆయన అన్నాడు. ఆ సమయంలో ఆమెతో మాట్లాడాలని ట్రై చేసినా.. టెక్నికల్, పూర్ సిగ్నల్ కారణంగా మాట్లాడలేక పోయానని చెప్పాడు రవిచంద్రన్. ఆ తర్వాత మరుసటి రోజు ఆమె సూసైడ్ చేసుకోవడంతో షాక్ అయ్యానని ఆయన చెప్పాడు. ఆ సంఘటన తనను నేటికీ వెంటాడుతోందని తెలిపాడు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.