డిస్ట్రిబ్యూటర్స్ కు గట్టి దెబ్బ.. సాహో ఇంత పని చేసిందా..?

‘సాహో’ ఎఫెక్ట్ వల్ల.. యూఎస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న తెలుగు స్టార్ హీరోల లిస్ట్ లో ప్రస్తుతం ప్రభాస్ పేరే ఠక్కున వినిపించేలా ఉంది. దీనికి తోడు ఇప్పటివరకూ ఏ సినిమా కలెక్ట్ చెయ్యని కలెక్షన్స్ ను ప్రభాస్ బాహబలి సిరీస్ అక్కడ మిలియన్స్ లో కలెక్ట్ చేశాయి. పైగా ‘బాహుబలి సిరీస్ తరువాత ప్ర‌భాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ కూడా ‘సాహో’నే. అన్నిటికి మించి అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల అవుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కింది. అయితే ఏ స్టార్ సినిమాకైనా యూఎస్ లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేస్తారు.

ఆ రకంగా సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అప్పుడే కోట్లు పెట్టి కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ పొజిషన్ లోకి వెళ్ళేది. కానీ కొన్ని కారణాల వల్ల సాహో యూఎస్ ప్రీమియర్ షోస్ ను క్యాన్సల్ చేశారట మేకర్స్.ప్రీమియర్స్ తో అదనపు కలెక్షన్స్ ను రాబట్టుకోవచ్చు అని ముందు నుంచీ ప్లాన్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఏమి అర్ధంకాక అయోమయ స్థితిలో ఉన్నారట. నిజానికి సాహో యూఎస్ రైట్స్ ఎవరూ ఊహించని విధంగా భారీ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు కొనుకోలు చేశారు. తీరా ఇప్పుడు కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చే ప్రీమియర్ లను రద్దు చేయడంతో అసలుకే మోసం వచ్చేలా ఉందని వారు కంగారు పడుతున్నారు. అసలు పెట్టిన భారీ మొత్తం తిరిగి రాబట్టే అవకాశం ఉందా అనేది అనుమానంలో యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కొట్టుమిట్టాడుతున్నారట.అయితే సినీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సాహో పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయని, పైగా యూఎస్‌లో ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఉందని డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువే వస్తోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

కానీ వాస్తవ పరిస్థుతుల మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండేలా కనిపిస్తున్నాయి. భారీ మొత్తంలో సినిమాని కొనడం, ఎక్కువగా డబ్బులు చేసే ప్రీమియర్లు రద్దు అవ్వడం సినిమా పై బాగానే ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్ షోస్ రద్దు అవ్వడం వల్లే సాహో డిస్ట్రిబ్యూటర్స్ పది కోట్లు మేరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.