దర్శకుల సీక్రేట్ బయటపేట్టిన శ్రీయ…? ఛాన్సిస్తే ఇంత చేస్తారా..

అందాల ముద్దుగుమ్మ శ్రీయ గురించి దక్షిణాది చిత్రపరిశ్రమలో తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇష్టం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ… టాలీవుడ్ లో యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించి అందరికీ తన నటనతో అందాలతో అదరగొట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తన క్యూట్ క్యూట్ నటనతో కూడా ఎంతో ముందు దర్శక నిర్మాతలను ఆకర్షించి ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ భాషల్లో కూడా నటించింది. అయితే కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో హవా నడిపించింది అని చెప్పవచ్చు.

అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది అనే చెప్పాలి. అయినప్పటికీ భర్తతో షికార్లు కొడుతున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 40 ఏళ్ళ వయసు దాటిపోతున్నా ఇప్పటికీ ఈ అమ్మడి అందం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇంకా అందరిలో సెగలు పుట్టిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే మంచి అవకాశాలు వస్తే మరోసారి వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది ఈ అమ్మడు . తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైనా శ్రియకు ఓ ప్రశ్న ఎదురయింది … మీకు అవకాశం రావడం లేదా… లేక కావాలని దూరం గా ఉంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకోచ్చింది.కొందరు దర్శక నిర్మాతలు పై సంచలన ఆరోపణలు చేసింది ఈ ముద్దుగుమ్మ.కొంతమంది దర్శక నిర్మాతలు మొదట చెప్పే కథ ఒకటి తర్వాత తీసే కథ మరోలా ఉంటుంది అని చెప్పిన ఈ అమ్మడు.. ఇటీవలి కాలంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది.ఎదో రెండు మంచి లైన్లు చెప్పి ఒప్పించి ఆ తరువాత ఇంకేదో తీస్తారు అని చెప్పుకొచ్చింది.

అందుకే కథ పూర్తిగా విన్న తర్వాత ఆ కథ నచ్చితేనే ఓకే చేస్తున్నానని అందుకే చాలా తక్కువ కథలను చేస్తున్నాను అంటూ తెలిపింది. ఇక ఐటెం సాంగ్ చేయడానికి కూడా సిద్ధమే అంటూ తెలిపింది. అయితే తాను ఏదైనా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలంటే ఆ సినిమాకు ఐటెం సాంగ్ ఎంతో ఇంపార్టెంట్ అయి ఉండాలని సినిమాకి ప్లస్ అయితే ఐటమ్ సాంగ్స్ చేస్తాను.. లేకపోతే వాటి జోలికి వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడికి దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తారా ఇవ్వరా చూడాలి మరి.