రామ్ గోపాల్ వర్మ్ షాకింగ్ ట్వీట్…. అతడిని పెళ్లి చెసుకుంటాడంట…

ప్రపంచంలో కరోనా ఎంత బీభత్సం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఓ వైపు మనుషుల ప్రాణాలు.. మరోవైను ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తుంది. కరోనా వల్ల ఇప్పటికే లక్షకు పైగా మరణాలు సంబవిస్తే.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువ.. కారణం ఆయనకు కాంట్రవర్సీలే ప్రాణం. ఏం చేసినా ఏం తీసినా.. ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక కాంట్రవర్సీ ఉండేలా చూస్తుంటారు. సమాజంలో జరిగే అనేక విషయాలపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్శ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు.

సినీ, రాజకీయ, క్రీడా, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆసక్తికర ట్వీట్లు చేస్తుంటారు. ఇక ట్విట్టర్ వేధికగా కొంత కాలంగా ఆయన చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మోదీ, ట్రంప్ సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ వీడియోను ఎడిట్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుంది అని ట్వీట్ చేశారు. భారత ప్రధాని వాయిద్యం వాయిస్తుంటే.. అమెరికా అధ్యక్షులు ట్రంప్ పాట పాడుతున్నాడు.అది కూడా ఒకప్పుడు రజినీకాంత్, మమ్ముట్టి నటించిన ‘దళపతి’ మూవీలో సాంగ్. ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట’

అనే పాట తమిళ వర్షన్‌ను దీనికి జత చేశారు. రజనీకాంత్, మమ్ముట్టి స్థానాల్లో మోదీ, ట్రంప్‌లను చేర్చి పోటి పడుతూ పాట పాడినట్టు ఎడిట్ చేశారు. మరి ఈ సాంగ్ ఎడిట్ చేసిన ఎడిటర్ మనోడికి ఎంత నచ్చాడో కానీ.. ఏకంగా పెళ్లి చేసుకోవాలనికామెంట్ చేస్తున్నాడు.