షాకింగ్.. మహేష్ బాబుతో కేజీఎఫ్ డైరెక్టర్

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే రాజమౌళి, వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని అనుకోగా ఆ సినిమాలకు ముందే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు. కె.జి.ఎఫ్ సినిమాతో ప్రతిభ చాటిన ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కె.జి.ఎఫ్ 2 సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ తర్వాత సినిమా మహేష్ తోనే అని ఫిల్మ్ నగర్ టాక్.

మహేష్ తో చేసే సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. ఎలాగు కె.జి.ఎఫ్ తో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్-2తో మరోసారి సంచలనాలకు సిద్ధమయ్యాడు. మహేష్ తో సినిమాను కూడా తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.