షాకింగ్ అఫ్ డేట్.. చిరు, కొరటాల సినిమా టైటిల్ ఇదే..?

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ప్రముఖ రచయిత, దర్శకులు కొరటాల శివ ఆ తర్వాత మహేష్ బాబు తో ‘శ్రీమంతుడు’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో మరో విజయం అందుకున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజీ’ మరోసారి మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ లాంటి సినిమాతో వరుసగా విజయాలు అందుకుంటున్నారు. ఎంట్రటైన్ మెంట్ తో పాటు సోషల్ మెసేజ్ తప్పకుండా ఉండేలా చూసుకుంటా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు కొరటాల శివ.

ఇక పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో బాక్సాఫీస్ షేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ లో ద్విపాత్రాభినయంలో నటించారు. రైతులు నీటికోసం పడుతున్న కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. మెగాస్టార్ 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఒకప్పుడు బ్రిటీష్ సైన్యాన్ని గడ గడలాడించిన మొట్టమొదటి తెలుగు స్వతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘సైరా’ రాంచరణ్ నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. కాకపోతే ‘సైరా’ కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది. ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సినిమాని ఆఫీషల్ గా అనౌన్స్ చేసారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారు అని టాక్ నడుస్తుంది.

ఈ మూవీ దేవాదాయ శాఖలో జరుగుతోన్న అక్రమాల చుట్టూ ఉండబోతుందని, ఇందులో చిరంజీవి ఆచార్య అనే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ మూవీకి ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు కొన్ని రోజుల నుంచి ఫిలిం నగర్ లో టాక్ . అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేయనున్నారు. సంగీత దర్శకుడు ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. ఈ మూవీ మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ని మరిపిస్తుందా..మరో హిట్ కొడతాడా అన్నది చూడాలి.