షాకింగ్ న్యూస్.. చిరు, కొరటాల మూవీ ఆగిపోయిందా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతనైకి సైరా చిత్రం విజయానందంలో మునిగి తేలుతున్నారు. వారు ఆశించిన దాని కంటే కూడా ఎక్కువ లాభాలు రావడంతో చిత్ర బృందం అంత కూడా పండగ చేసుకుంటున్నారు. కాగా సైరా చిత్రం తరువాత చిరు చేయబోయే చిత్రాన్ని కూడా ప్రకటించేశారు. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సామాజిక అంశంతో కూడిన సినిమా  చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే ఘనంగా నిర్వహించారు కూడా.

కాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త చిరు అభిమానులను కలవరపెడుతుంది.అదేంటంటే… చిరు, కొరటాల చిత్రానికి బ్రేక్ పడిందని వార్తలు వస్తున్నాయి. అవును నిజంగానే వాయిదా పడింది. కానీ పూర్తిగా కాదు, కేవలం ఒక నెల రోజులు మాత్రమే. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి చిరు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకోనున్నారంట. అందుకనే ఈ చిత్రం కాస్త ఆలస్యం అవుతుందని, డిసెంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తామని చెప్పుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేయగా, మరొక హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.