ఫామ్ లోకి వచ్చిన ప్రియమణి, ఒక ఉపు ఉపేస్తుందిగా..?

జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ప్రియమణి ఒకరు. కెరీర్ ప్రారంభంలో అంత సాఫీగా సాగకపోయినప్పటికి ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. స్టార్స్ సరసన నటించింది. సూపర్ హిట్స్ ని అందుకుంది. తెలుగు, తమిళ ప్రేక్షకులలో బాగా క్రేజ్ ని సంపాదించుకుంది. పెళ్ళి చేసుకొని గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న ప్రియమణికి… ప్రస్తుతం వరసగా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఫ్యామిలీ మాన్ అన్న వెబ్ సిరీస్ తో మళ్ళీ ఫాం లోకి వచ్చింది.

దాంతో ఇప్పుడు సినిమాలు దక్కించుకుంటుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకి ఒక మంచి ఛాయిస్ గా మారుతుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకి ఇప్పుడు వారి ఏజ్ కి తగ్గ హీరోయిన్స్ దొరకడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ ఈ సమస్యని బాగా ఎదుర్కుంటున్నారు ఈ మధ్య ఈ ఇద్దరి హీరోలకి హీరోయిన్స్ ని సెలెక్ట్ చేయడానికి దర్శక నిర్మాతలకి బాగా ఇబ్బందులు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో ప్రియమణి రీ ఎంట్రీ తో చెలరేగిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఇప్పటికే ప్రియమణి తెలుగులో ఒక సినిమా చేస్తుందన్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో ప్రియమణికి మంచి ఛాన్స్ వచ్చింది. తమిళంలో భారీ హిట్ అయిన అసురన్ రీమేక్ తెలుగులో వెంకటేష్ తో నారప్ప గా తెరకెక్కిస్తున్న సినిమాలో వెంకటేష్ కి భార్యగా నటిస్తుంది.ఈ సినిమా తో పాటు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘విరాటపర్వం’ లోను ప్రియమణి నటిస్తుంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 70శాతం టాకీ పార్ట్ ని కంప్లిట్ చేసుకుంది. ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్ గా సాయిపల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారు. ఇదే సినిమాలో ప్రియమణి సాయి పల్లవితో పాటు నక్సలైట్ గా నటిస్తుందని తాజా సమాచారం. ఈ రెండు సినిమాలతో మళ్ళీ ప్రియమణి బిజీ అయ్యో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ న్యూస్. ఇది కొంతమందికి షాకింగ్ న్యూస్ అని కూడా అంటున్నారు. ప్రియమణి దూకుడు చూస్తుంటే కొంతమంది హీరోయిన్స్ కి చమటలే అని చెప్పుకుంటున్నారట.