శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. షకీలాని అలా అనేసిందేంటి..?

షకీలా.. ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు. ఒకప్పుడు అడల్ట్ సినిమాలతో రసిక ప్రియులకు ఊపు తెప్పించిన ఈమె.. ప్రస్తుతం అలాంటి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అడపాదడపా టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ, మంచి పాత్రలు వస్తే మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధం అని అంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో షకీలపై సంచలన తార శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..అప్పట్లో స్టార్ హీరోలకు ధీటుగా షకీలా సినిమాలు థియేటర్స్‌లో ఆడేవి. అలా శృంగార తారగా తెలుగు, తమిళ భాషల్లో భారీ క్రేజ్ సంపాదించిన షకీలా.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకొని తాను రోడ్డుపై నిలబడలేనని అనేసింది.

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలను మోసం చేసి వదిలేస్తున్నారని గతంలో శ్రీ రెడ్డి సృష్టించిన హంగామా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నది రోడ్డుపైనే బట్టలిప్పి నగ్నంగా నిరసన తెలిపింది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలోనే శ్రీ రెడ్డిని ఉద్దేశిస్తూ షకీలా కామెంట్ చేసింది.తనపై షకీలా చేసిన కామెంట్స్ విన్న శ్రీ రెడ్డి కొద్దిరోజుల పాటు సైలెంట్ గానే ఉండి.. ఇప్పుడు తన వాయిస్ బయటపెట్టింది. షకీలా క్యారెక్టర్‌ని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్ చేసింది. సెక్సీ స్టార్ షకీలా మీద తన అభిప్రాయం ఇది అని చెప్పేస్తూ ఎవ్వరూ ఊహించని పదజాలం వాడింది శ్రీ రెడ్డి.గతంలో షకీలా నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ.. శ్రీ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా స్పందించింది. షకీలా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. అంతేకాదు ఆమెతో ఫోన్‌లో మాట్లాడానని, ఆమె ఇంటర్వ్యూలు చూసిన తర్వాత షకీలా చాలా ఉత్తమురాలని అర్థమైందని చెప్పి షాకిచ్చింది శ్రీ రెడ్డి.తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలోని అగ్ర తారల పేర్లతో సహా బయటపెట్టి విమర్శలకు దిగుతున్న శ్రీ రెడ్డి.. షకీలా విషయంలో ఇలా స్పందించడం చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. తన పర్సనల్ విషయాల జోలికొస్తే అస్సలు వదలని శ్రీ రెడ్డి.. ఇలా మాట్లాడటంలో లాజిక్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.

ఇక గతంలో సెక్సీ స్టార్‌గా మంచి గుర్తింపు పొందిన షకీలా.. కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్‌లో తన జీవితంలో పడిన కష్టాలు, సొంత అక్క చేతిలో మోసపోయిన తీరు చెప్పి ఆమె ఫాన్స్‌ కళ్ళలో కన్నీరు నింపింది. అవన్నీ మరిచి ఇటీవలే ‘కొబ్బరి మట్ట’ సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది షకీలా. ఈ చిత్రంలో కత్తి మహేష్ తో జోడీగా, సంపూ తల్లిగా నటించి మెప్పించింది షకీలా.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.