షాహిద్ కపూర్ షాకింగ్ రెమ్యూనరేషన్.. నాని సినిమాకి అంత తీసుకుంటున్నాడా..?

షాహిద్ మరో తెలుగు సినిమా రీమేక్‌లో నటించబోతున్నారు. వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది నాని హీరోగా నటించిన చిత్రం జెర్సీ. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. అల్లు అరవింద్‌, దిల్‌రాజు, అమన్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది ఆగస్ట్ 28న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు.ఇక ఈ సినిమా కోసం షాహిద్‌ కపూర్‌ రూ. 40 కోట్ల మేర రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.