సందీప్ కొత్త సినిమా అ స్టార్ హీరోతోనే..? టైటిల్ వెరీ ఇంట్రస్టింగ్

రెండేళ్ల కిందట ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు దాని రీమేక్ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లోనూ ప్రకంపనలు రేపాడు. ఈ సినిమా ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఔరా అనిపించింది. ముందు అనుకున్న ప్రకారం అయితే.. సందీప్ ఈ సినిమా పూర్తి చేసి టాలీవుడ్‌కు తిరిగి రావాల్సింది.కానీ ‘కబీర్ సింగ్’ అనూహ్య విజయం సాధించడంతో బాలీవుడ్ వాళ్ల కళ్లు అతడిపై పడ్డాయి. వాళ్లు సందీప్ తన బేస్‌ను ముంబయికి షిఫ్ట్ చేసుకునేలా చేశారు. తన తర్వాతి సినిమాను బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్‌తో చేయబోతున్నాడు సందీప్. ఇటీవలే సందీప్.. అతడికి లైన్ చెప్పడం, అతను ఓకే అనడం చకచకా జరిగిపోయాయి.

ప్రస్తుతం స్క్రిప్టును పక్కాగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడు సందీప్. త్వరలోనే ప్రి ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. సందీప్-రణబీర్ సినిమాకు టైటిల్ కూడా ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. ‘డెవిల్’ అనేది ఆ చిత్ర టైటిల్ అని సమాచారం. ఈ టైటిల్‌ను బట్టే సందీప్ హీరో పాత్రలో మరోసారి నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయని అర్థమవుతోంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం రణబీర్‌ది నెగెటివ్ టచ్ ఉన్న పాత్రేనట.మరోసారి సందీప్ తనదైన శైలిలో ఇంటెన్స్ మూవీ తీయడానికే ప్రయత్నించబోతున్నాడట. బాలీవుడ్లో తొలి ప్రయత్నంలో రీమేక్‌తో సత్తా చాటిన సందీప్.. ఈసారి డైరెక్ట్ మూవీతోనే తనేంటో చాటిచెప్పాలనుకుంటున్నాడు. హిందీలో సందీప్ నిర్మాణంలోనూ ఒక సినిమా తెరకెక్కబోతుండటం విశేషం. మరి ఆ రెండు ప్రాజెక్టులు అయ్యాక అయినా సందీప్ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.