సినిమా ఛాన్స్ కోసం అనుష్క ఏం చేసిందో చూడండి.. ఇది తెలిస్తే నిజంగా నమ్మలేరు..!

దేవసేన, భాగమతి, జేజమ్మ.. అగ్ర కథానాయిక అనుష్క పేరు చెబితే గుర్తొచ్చే పాత్రల పేర్లు ఇవి. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. మొదట్లో సినిమా అవకాశాల కోసం ఈ భామ చేసిన పనిని చూస్తే ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే.. దేవసేన, భాగమతి, జేజమ్మ.. అగ్ర కథానాయిక అనుష్క పేరు చెబితే గుర్తొచ్చే పాత్రల పేర్లు ఇవి. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. ఇక అభిమానులు మాత్రం ఆమెను ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుస్తుంటారు. ఇండస్ట్రీ పెద్దలకూ ఆమె స్వీటీనే. మరి అలాంటి అనుష్క గురించిన మరికొన్ని నిజాలు ఏమిటో చూద్దాం.. అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి..సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా మారింది. బేసిగ్గా అనుష్క చాలా సిగ్గరి. సినిమాల్లోకి రాకముందు యోగా ట్రైనర్ గా ఉన్న అనుష్క సినిమాల్లోకి వస్తాననే ఎప్పుడు అనుకోలేదట.నటన,డ్యాన్స్ అనేవి తెలియకపోయినా ఈ స్థాయికి రావడం వెనుక గల ఏకైక కారణం తన హార్డ్ వర్క్ అంటుంది.

సినిమాల్లో కనపడే అనుష్క బైట ఆడియో ఫంక్షన్స్ ఇతర ఫంక్షన్స్ లో కనపడే అనుష్కకి చాలా తేడా ఉంది.ముఖ్యంగా దుస్తుల విషయంలో..కేవలం పాత్ర ప్రాధాన్యతను బట్టి దుస్తులు ధరించే అనుష్క బైట మాత్రం చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుంది.స్కర్ట్స్,వెస్ట్రన్ వేర్ ని ఇష్టపడని అనుష్క ఎక్కువగా చీరలు,చుడీదార్స్ లోనే దర్శనమిస్తుంది. బంగారాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడదు. ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ ఏదన్నా ఫోటో ఇవ్వమని అడిగితే పర్స్ లో నుండి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చిందట. దానికి పూరి పెద్దగా నవ్వి ..‘సూపర్’ ఆడిషన్ కి రమ్మని ఇన్వైట్ చేస్తే..ఫోటోకి ఎలా పోజ్ ఇవ్వాలో తెలియని అనుష్కకి నాగార్జునే నేర్పించారట. అప్పటి నుండి ఇప్పటివరకు అనుష్క వెనుదిరిగి చూసింది లేదు.

సినిమాల్లో ఎంతో ధైర్యశాలిగా కనపడే అనుష్కకి ఎత్తైన ప్రదేశాలంటే భయం. బిల్లా సినిమాలో ఎత్తుడి దూకాల్సిన స్టంట్ చేసేప్పుడు భయపడ్డమే కాదు. చేశాక ఒకటే ఏడుపట. ఇంటికెళ్లాక కూడా ఆ సంఘటన మర్చిపోకుండా ఏడ్చిందట అనుష్క. రాజమౌలితో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది కూడా అనుష్కనే ఒకటి విక్రమార్కుడు,రెండు మూడు బాహుబలి సిరీస్‌లు. ఫోన్ విషయంలో కూడా చాలా తక్కువగా వాడుతుందట. న్యూస్ కి ,సోషల్ మీడియాకి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటుందట అనుష్క.నటజీవితానికి స్వస్తి చెప్పాక చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ బతకాలనుకుంటుందట. ప్రయాణాలంటే కూడా అనుష్కకి ఇష్టం.బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఫ్రెంచ్ మూవీస్ లో నటించాలనేది అనుష్క కోరిక..డిఫరెంట్ స్టోరీ,తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే హిందీ,ఫ్రెంచి భాషల్లో నటిస్తుందట.భాగమతి స్క్రిప్ట్ ఎప్పుడో విన్నప్పటికీ ఐదేండ్ల తర్వాత డేట్స్ ఇచ్చిందట అనుష్క .అన్నేళ్ల తర్వాత సినిమా సెట్స్ మీదికెల్లేముందు ఏ క్వశ్చన్ అడగకుండానే యాక్సెప్ట్ చేసిందట.అనుష్క అంటే చాలా మంచి నటి అని మనం అనుకుంటాం కానీ ఇప్పటికీ తనకొచ్చే ప్రతి పాత్రనుండి నటనను నేర్చుకునే దశలోనే ఉన్నానంటుంది అనుష్క.