సీక్రేట్ రిలేషన్ బట్టబయలు.. పెళ్ళి చేసుకోబోతున్న శ్రద్ద కపూర్..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పెళ్లి వార్తలు ఎప్పుడూ ఆసక్తి కలిగించే అంశాలుగానే ఉంటాయి. ఫలానా హీరోయిన్ ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తోందని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సాధారణంగా వింటూనే ఉంటాం. ఈ కోవలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ పెళ్లికి రెడీ అయిందనే ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. శ్రద్ద కపూర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠతో ఆమె విబాహం జరగనుందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..శ్రద్ద కపూర్, రోహన్ శ్రేష్ఠ ల మధ్య చాలా కాలంగా రిలేషన్ షిప్ కొనసాగుతోంది.

ఈ మేరకు వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి పలు పార్టీలు చేసుకోవడం, షికార్లు కొట్టడం చూసి మరో రెండేళ్లలో ఈ ఇద్దరి పెళ్లి కానుందని రూమర్స్ వ్యాపించాయి.శ్రద్ద కపూర్ తన బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠతో 2020 లో పెళ్లి జరుపుకోనుందని, ఈ మేరకు అందుకు సంబందించిన కార్యక్రమాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారని తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ వెల్లడించడంతో సినీ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. శ్రద్ద కపూర్ తల్లి శివాంగి కపూర్ దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు చేస్తోందని సదరు వార్త సారాంశం.అయితే శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలను ఆమె తండ్రి శక్తి కపూర్ కొట్టిపారేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా శ్రద్ద పెళ్లిపై స్పందించిన ఆయన.. ఆ వార్తల్లో నిజం లేదు ‘బుల్ షిట్’ అంటూ.. ఇంకో ఐదేళ్ల వరకు శ్రద్ద పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని అన్నారు. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉందని ఆయన చెప్పాడు. మరో రెండేళ్లు వరుస సినిమాలకు శ్రద్ద కమిటై ఉందని స్పష్టం చేశారు.

కాగా తాము పెళ్లి చేసుకోబోతున్నాం అని వస్తున్న వార్తలపై శ్రద్ద కపూర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠ స్పందించారు. గత 9 సంవత్సరాలుగా తాము క్లోజ్ రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నామని, కానీ డేటింగ్ లో లేమని అన్నాడు. శ్రద్ద కేవలం తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని చెప్పాడు. మొదటి సారి ఆమెను ఓ పార్టీలో చూశానని, అప్పటి నుంచి స్నేహితులుగానే ఉన్నామని అన్నాడు రోహన్ శ్రేష్ఠ. ఇక శ్రద్ద కపూర్ సినిమాల విషయానికొస్తే.. భారీ ప్రాజెక్టు ‘సాహో’ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది గాక ‘స్ట్రీట్ డాన్సర్ 3డి’ మూవీతో పాటు నితేష్ తివారి దర్శకత్వంలో ‘చిచ్చోరె’ మూవీలో నటిస్తోంది శ్రద్ద కపూర్.