సావిత్రి కోమాలో ఉన్నప్పుడు జరిగిన షాకింగ్ సంఘటన.. బయటపెట్టిన ప్రముఖ వ్యక్తి

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి గురించి బయోపిక్ వచ్చినా ఇంకా కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ కాలంలో సావిత్రిని చూసినవాళ్లు ఏవో విషయాలను చెబుతూనే ఉన్నారు. కొన్ని సెన్సేషన్ అవుతున్నాయి. మరికొన్ని ఆసక్తిగా ఉంటున్నాయి. ఇలా సావిత్రి గురించి ఎన్ని చెబుతున్నా ఇంకా బయట ప్రపంచానికి తెలీని కొన్ని విషయాలున్నాయి. తన అసమాన నటనతో ఆకట్టుకున్న సావిత్రికి బంగారంపై మమకారం ఎక్కువే.

వాస్తవానికి సావిత్రికి,బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ఆమె ఇంట్లోనే ఏడాది పొడవునా బంగారు ఆభరణాలు తయారు చేస్తూనే ఉండేవారంటే అతిశయోక్తి కాదు. అసలు ఆమెకు ఎన్ని ఆభరణాలున్నాయో ఆమెకే తెలీదని కొందరు చెప్పేమాట. ఆమె పనివాళ్ళు కూడా ఆభరణాలను తీసేసుకుని బయట అమ్మేసేవారని, ఇలా అమ్ముతుండగా షావుకారు జానకి పనివాళ్లను పట్టుకున్నారని కూడా స్వయంగా జానకి ఓ ఇంటర్యూలో చెప్పారు. పనివాళ్ళు పట్టుకుపోగా కొన్ని కూతురుకోసం ఇచ్చారని,మరికొన్ని ఆదాయపు పన్ను వివాదంలో ఇరుక్కున్నాయని అంటారు.
అయితే ఇంకా చాలా బంగారం గోల్డ్ బాండ్స్ రూపంలో దాచిపెట్టారని ఆరుద్ర భార్య రామలక్ష్మి చెబుతారు.

అయితే కోమాలో ఉండగా కూడా బాండ్స్ అలానే ఉండడంతో జెమిని గణేశన్ వచ్చి, వేలిముద్ర వేయించుకుని వాటిని క్యాష్ రూపంలో మార్చేసుకున్నారని రామలక్ష్మి తెలిపారు. జెమిని తొలిభార్య తన కూతురు మెడికల్ సీటుకోసం సావిత్రి రవ్వల హారం అడిగితె ,ఆమె ఇవ్వకపోవడంతో గట్టిగా పళ్ళు ఊడిపోయేలా కొట్టారని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి చెప్పిన విషయాలు పత్రికల్లో వచ్చాయి. ఇక కూతురి మీద కూడా నమ్మకం లేకపోవడంతో కొన్ని నగలను బి సరోజా దగ్గర ఉంచినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.