సరిలేరు టార్గేట్ అదేనా..

సంక్రాంతికి మాస్‌ సినిమా క్లిక్‌ అయితే ఎలా వుంటుందనేది చాలా సార్లు రుజువయింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మొన్నీమధ్య వచ్చిన ఖైదీ నంబర్‌ 150 లాంటి చిత్రాలు దానికి ఉదాహరణలు. సింగిల్‌ స్క్రీన్స్‌లో మాస్‌ సినిమాలకి వుండే క్రేజ్‌ అలా ఇలా వుండదు. ఫ్యామిలీ సినిమాలు కూడా సంక్రాంతికి బాగా ఆడుతుంటాయి కానీ మాస్‌ సినిమాపై వుండే మోజే వేరు.సంక్రాంతి పెద్ద సినిమాల రెండింటి ట్రెయిలర్లు రిలీజ్‌ కాగా ఏది ఎలా వుంటుందనే దానిపై ఎగ్జిబిటర్లకి ఒక అంచనా వచ్చేసింది. దీంతో సరిలేరు నీకెవ్వరు పూర్తిగా మాస్‌ని టార్గెట్‌ చేసిన సినిమా అనేది స్పష్టమయింది. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ బి, సి సెంటర్లలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.

 

మల్టీప్లెక్సుల ఊసు కూడా తెలియని ఈ ప్రాంతాలలో రెండు థియేటర్లు వుంటే రెండిటిలోను సరిలేరు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయట. ఫిక్స్‌డ్‌ హైర్లు కూడా భారీ స్థాయిలో ఆఫర్‌ చేస్తున్నారట. ఈ లెక్కన అల వైకుంఠపురములో కంటే ఒక రోజు ముందుగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’కి హిట్‌ టాక్‌ వస్తే పల్లెటూళ్లు, చిన్న పట్టణాలలో అల వైకుంఠపురములోకి సరిపడా థియేటర్లు దొరకడం కష్టమవుతుందనే టాక్‌ వినిపిస్తోంది.