సంక్రాంతి హవా మామూలుగా లేదుగా… బాక్సాఫిస్ బద్దలవుతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలుగు హీరోయిన్లలో సమంత ముందు వరుసలో ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. కేవలం అప్‌డేట్స్ వరకే అయితే సమంత అందరిలోనూ ప్రత్యేకం ఎందుకు అవుతుంది. నెటిజన్స్, అభిమానుల ఫన్నీ కామెంట్లకు, సీరియస్ కామెంట్లకు సమంత రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇలా వీరి మధ్య అప్పుడప్పుడు టాపిక్ వేడెక్కిపోతుంది కూడా. తాజాగా సమంత చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారుతోంది.టాలీవుడ్‌కు సంక్రాంతి సీజన్ అనేది పెద్ద సెంటిమెంట్. ఈ సీజన్‌లో బడా హీరోలు సినిమాలతో బరిలోకి దిగుతారు. కనీసం రెండు సినిమాలు రంగంలోకి దిగుతాయి. ఇక రెండు సినిమా కాసింత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ కళకళలాడాల్సిందే.అందుకే పెద్ద సినిమాలు సంక్రాంతి సీజన్‌కు కర్చీప్ వేసుకుని బెర్త్‌లు కన్ఫామ్ చేసుకుంటాయి.అయితే అన్ని సంక్రాంతుల మాదిరిగానే ఇద్దరు బడా స్టార్లు బరిలోకి దిగారు.మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో పోటీ పడేందుకు వచ్చారు. అయితే చివరి నిమిషం వరకు విడుదల తేదీలో ఉత్కంఠ రేపగా.. చివరకు అందరూ కూర్చుని మాట్లాడుకుని విషయాన్ని సద్దుమణిగేలా చేసుకున్నారు.

 

 

గత సంక్రాంతికి బడా స్టార్ల సినిమాలు తుస్సుమంటే ఈ సారి మాత్రం రెండూ బ్లాక్ బస్టర్లే అయ్యాయి. నిన్న విడుదలైన సరిలేరు చిత్రం, నేడు రిలీజ్ అయిన అల వైకుంఠపురములో చిత్రానికి పాజిటివ్ టాక్స్ వచ్చాయి. ఆల్రెడీ సరిలేరు రికార్డుల వేటను మొదలు పెట్టేసింది. ఇలా రెండు బడా సినిమాలు హిట్ కావడంపై సమంత స్పందించింది.తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గోల్డెన్ డేస్. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’.. రెండు సినిమాలు 2020కి గ్రేట్ స్టార్ట్‌ని ఇచ్చాయి. ఈ చిత్రాల విజయానికి కారణమైన క్రేజీ ఫ్యాన్స్‌తో పాటు..రెండు చిత్ర బృందాలకు బిగ్ బిగ్ కంగ్రాట్యులేషన్స్ అంటూ సమంత ట్వీట్‌ చేసింది.సరిలేరు నీకెవ్వరు చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లపై కన్నేసి రికార్డులను క్రియేట్ చేసింది. అయితే అల వైకుంఠపురములో చిత్రానికి ఆ అవకాశం లేదు. ఎందుకుంటే సగం థియేటర్లలో సరిలేరు పాగా వేసింది. అయితే ఈ రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో ఏ ఢోకా లేకుండా పోయింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద ఎంత కొల్లగొడతాయనేది లెక్కలు వేసుకోవడమే తరువాయి. ఇరువురు ఫ్యాన్స్ ఇక లెక్కలు, వసూళ్లు, నంబర్లపై పడే అవకాశముంది.