బిగ్ బాస్ 3 లో అన్ని ఘోరాలా.. సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్ శ్వేత

దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ రియాల్టీ షోకు మంచి ఆదర ఉంది. ఈ బుల్లితెర రియాల్టీ షోపై ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. అది బిగ్‌బాస్ కాదనీ, బ్రోతల్ హౌస్ అంటూ మండిపడింది. పైగా, ఈ రియాల్టీ షో పేరుతో నిర్వహించే బ్రోతల్ హౌస్‌ను బ్యాన్ చేయాలంటూ ఆమె డిమాండ్ చేసింది.తెలుగులో బిగ్ బాస్ -3 సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. దీనికి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. దీనిపై శ్వేతా రెడ్డి స్పందిస్తూ, ఈ సీజన్-3లో పాల్గొనేందుకు తనను సంప్రదించి, ఎంపిక చేశారన్నారు. ఆ తర్వాత తమ కోరిక తీర్చాలని కోరారని చెప్పారు.

బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేస్తేనే అవకాశం లభిస్తుందని చెప్పారని, అంటే.. బిగ్‌బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడుస్తోందని ఆమె ఆరోపించారు. ఒక విధంగా చెప్పాలంటే క్యాస్టింగ్ కౌచ్‌కు బిగ్ బాస్ కేంద్రంగా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందువల్ల ఈ షోను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బిగ్ బాస్ ముసుగులో జరుగుతున్న వాటిని బయటపెట్టడానికే తాను ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చినట్టు శ్వేతా రెడ్డి చెప్పారు. గత ఏప్రిల్‌‌ నెలలో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని, బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌కు ఎంపిక చేశామని చెప్పారని, ఎందుకని అడిగితే, పాప్యులర్‌ యాంకర్‌ కాబట్టి తీసుకున్నామని చెప్పారని తెలిపారు.

ఆపై కార్యక్రమ సమన్వయకర్త రవికాంత్‌ తనకు పలుమార్లు ఫోన్ పిలిపించి మాట్లాడారని, ఒప్పందం కుదుర్చుకునే సమయంలో తాను సంతకాలు కూడా చేశానని శ్వేతారెడ్డి తెలిపారు. అయితే, అ ఒప్పంద పత్రాల జిరాక్స్ కాపీలు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. ఆపై తమ బాస్‌‌ను ఇంప్రెస్‌ చేయాలని కార్యక్రమ ప్రొడ్యూసర్‌ శ్యామ్‌ తనను అడిగారని, తానెందుకు ఇంప్రెస్‌ చెయ్యాలని నిలదీశానని చెప్పారు. హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా రావాలని తనకు ఫోన్ల మీద ఫోన్లు చేసిన రఘు, రవికాంత్‌, శ్యామ్‌ ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని ఆమె ఆరోపించారు.