సమంత కామెంట్… పర్సనల్ లైఫ్ గురించి మొత్తం చెప్పెసింది..

పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది సమంత. అక్కినేని కోడలు అయిన తర్వాత కూడా ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత అక్కినేని ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా జాను సినిమాలో నటిస్తుంది సమంత. ఫిబ్రవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. దిల్ రాజు నిర్మాత. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు రీమేక్ ఇది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కూడా కమిటైంది సమంత అక్కినేని.ఇప్పటికీ చేతినిండా యాడ్స్, సినిమాలతో బిజీగా ఉంది ఈమె. మరోవైపు భర్త నాగ చైతన్య కూడా వరస సినిమాలు చేస్తున్నాడు. వెంకీ మామ, మజిలీ లాంటి విజయాలతో ఈయన కెరీర్ కూడా దూకుడు మీదుంది. ఇదిలా ఉంటే ఇప్పుడే తన రిటైర్మెంట్ తర్వాత ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటుంది సమంత అక్కినేని. పిల్లలు వచ్చిన తర్వాత సినిమాలు చేయనని చెప్పేసింది సమంత. ఆ తర్వాత చాలా బ్రేక్ తీసుకోవాలని చూస్తుంది ఈమె.

 

అందుకే ఇప్పట్నుంచే ఆ ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది స్యామ్. ముఖ్యంగా తమ పెళ్లి జరిగిన గోవా అంటే ఈమెకు చాలా ప్రత్యేకం. అందుకే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తుంది సమంత అక్కినేని.తన జీవితంలో ప్రతీ చిన్న సెలబ్రేషన్‌ను అక్కడే జరుపుకుంది సమంత. సినిమాలు లేనప్పుడు భర్తతో పాటు ఇక్కడికే వస్తుంది ఈ ముద్దుగుమ్మ. వీలైనన్ని రోజులు గోవాలో ఉండటానికి ఎప్పటికప్పుడు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది ఈమె.ఇక సినిమాల నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడే ఉండిపోవాలని.. అందుకే ఓ సొంతిళ్లు తీసుకోవాలని చూస్తుంది స్యామ్. ఇప్పటికే గోవా అంత జల్లెడ పడుతున్నారు సమంత సన్నిహితులు. బీచ్‌కు దగ్గరలో అద్భుతమైన వ్యూ ఉండేలా ఈ ఇళ్లు తీసుకోవాలని చూస్తుంది సమంత. దీనికోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ గోవాలో ఇల్లు తీసుకోవడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. మొత్తానికి సమంత తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.