మరింత రెచ్చిపోతున్న సమంత.. మండిపడుతున్న అభిమానులు !

సమంత లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఆఫోటోను చూసిన నాగచైతన్య అభిమానులు సమంత పై విపరీతమైన కోపంతో రగిలి పోతున్నారు. దీనికి కారణం సమంత ఒక కుక్క ఫోటోను షేర్ చేస్తూ దాని మెడ చుట్టూ ‘నెంబర్ వన్ హజ్ బెండ్’ అంటూ ఒక బెల్ట్ పై అక్షరాలు వ్రాసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీనితో సరదాగా సమంత వేసిన జోక్ వికటించింది. ఈ ఫోటోను ఇలా షేర్ చేయడం చైతన్యకు అవమానం అంటూ చైతూ అభిమానులు మండి పడిపోతున్నారు. అంతేకాదు. సమంత దృష్టిలో చైతన్య స్థాయి ఇది అని అనుకోవాలా అంటూ విమర్శిస్తున్నారు.

నాగచైతన్య సమంతలు ఎంత సన్నిహితంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు చైతూ తన మాట వినకుండా తనను టార్చర్ పెడుతూ ఉంటాడు అంటూ సమంత అనేక ఇంటర్వ్యూలలో ఓపెన్ గా చెప్పింది. అంతేకాదు చాలామంది అనుకుంటున్నట్లుగా తన మాటలు అన్నీ చైతన్య వినడనీ తానే గత్యంతరం లేక చైతన్యతో సద్దుకుపోతున్నాను అంటూ జోక్ చేసింది. దీనితో చైతన్య పై తన కోపాన్ని ఇలా సమంత కుక్కను అడ్డు పెట్టుకుని ఈ విధంగా తన అసహనాన్ని ప్రదర్శించిందా అంటూ మరి కొందరు జోక్ చేస్తున్నారు.

వాస్తవానికి సమంత ఇంటిలో ఖాళీగా ఉన్నప్పుడు చైతన్య ఆమెకు సహాయ పడుతూ వంట కూడ చేస్తాడు. అయితే అలాంటి చైతూ పై సెటైర్ వేయడం చైతన్య అభిమానులకి ఏమాత్రం నచ్చడం లేదు. ఈ మధ్య కాలంలో సమంత వేస్తున్న సెటైర్లు శృతిమించి పోతున్నాయి అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అనవసరంగా దసరా పండుగ రోజున సమంత చైతన్య అభిమానులను కెలికి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకుంది అని అనుకోవాలి..