స‌మంత‌కు అవ‌కాశాల్లేవని అడిగినందుకు చైతు షాకింగ్ అన్సర్..!

గ‌త రెండేళ్ల‌లో స‌మంత కెరీర్ బ్ర‌హ్మాండంగా సాగుతోంది. స‌క్సెస్ రేట్ విష‌యంలో తిరుగులేదు. రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, ఇరుంబు తిరై, మ‌జిలీ, ఓ బేబీ.. ఇలా చాలా హిట్ల‌నే ఖాతాలో వేసుకుందామె. ఈ సినిమాల్లో స‌మంత న‌ట‌న‌కు మంచి పేరు కూడా వ‌చ్చింది. అయినా కూడా ఇప్పుడు స‌మంత కెరీర్ డోలాయ‌మాన స్థితిలో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆమె చేతిలో సినిమాలే ఉన్న‌ట్లు లేదు.పెద్ద సినిమాల్లో స‌మంత‌ను ఎంచుకునే విష‌యంలో ఫిలిం మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. స‌మంత‌కు పెళ్లికావ‌డం తెలియ‌కుండానే ఆమె కెరీర్‌పై ప్ర‌భావం చూపిన‌ట్లు క‌నిపిస్తోంది. సినిమాల ఎంపిక‌లో స‌మంత కూడా మ‌రీ సెలెక్టివ్‌గా మారిపోవ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

మ‌రి మున్ముందు స‌మంత కెరీర్ ఎలా ఉండ‌బోతోంద‌నే విష‌యం ఆమె భ‌ర్త నాగ‌చైత‌న్యను అడిగితే ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించాడు.స‌మంత కెరీర్‌కు ఇప్పుడొచ్చిన ఢోకా ఏమీ లేద‌ని అన్నాడు చైతూ. స‌మంత కెరీర్ గ‌త రెండేళ్ల‌లో బెస్ట్ ఫేజ్‌లో ఉంద‌ని చైతూ చెప్పాడు. ఈ రెండేళ్ల‌లో కెరీర్ బెస్ట్ అనిపించే సినిమాలు చేసింద‌న్నాడు. ఈ సినిమాల‌న్నీ హిట్ట‌వ‌డ‌మే కాక స‌మంత‌కు మంచి పేరు తెచ్చాయ‌న్నాడు. ఇప్పుడామె వెబ్ సిరీస్ కూడా చేస్తున్న‌ట్లు చైతూ ధ్రువీక‌రించాడు. సినిమాల క్వాంటిటీ త‌గ్గి ఉండొచ్చు కానీ.. క్వాలిటీ మాత్రం చాలా పెరిగింద‌ని.. ఈ విష‌యంలో స‌మంత చాలా సంతోషంగా ఉంద‌ని.. సామ్ ఉద్దేశ‌పూర్వ‌కంగా ఈ దారిలో వెళ్తోంద‌ని చైతూ చెప్పాడు.త‌క్కువ సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాల‌నుకుంటోంద‌ని.. ఆమె కావాల‌నుకుంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చ‌ని.. కానీ ఎక్కువ సినిమాలు అని లెక్క చూసుకోకుండా మంచి సినిమాలు చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతోంద‌ని.. అందుకే ఆమెకు సినిమాలు త‌గ్గాయ‌ని చైతూ చెప్పాడు.