సమంతానా మజాకా హ్యాండ్ బ్యాగ్ రేటెంతో తెలుసా..??

మన అందాల కథానాయికలు మేకప్ కోసం.. యాక్సెసరీస్ కోసం లక్షల్లో ధనాన్ని ఖర్చు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఒక మేకప్ అసిస్టెంట్ కోసం రూ.30వేల నుంచి రూ.40వేల జీతం చెల్లించే వాళ్లు ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. నెలవారీగా స్టాఫ్ కి లక్షల్లో పారితోషికాలు ఇచ్చి పోషిస్తుంటారు. ఈ కల్చర్ బాలీవుడ్ లో ఇంకాస్త పెద్ద రేంజులోనే ఉంటుంది. అలాగే పలువురు బాలీవుడ్ కథానాయికలకు బ్రాండ్స్ పిచ్చి మరీ ఎక్కువ. క్వీన్ కంగన మొదలు.. యంగ్ బ్యూటీస్ అలియా భట్ – జాన్వీకపూర్ ఈ తరహా హ్యాబిట్ ని కొనసాగిస్తున్నారు. ఈ భామలు ఇటీవల ఓ ఖరీదైన ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ ని మెయింటెయిన్ చేస్తున్నారు.

బ్లాక్ కలర్ పై తెల్లని చారలు హైలైట్ గా కనిపిస్తున్న ఈ బ్యాగ్ ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ.59000 అంతకుమించి ఉంటుందట. ఆ మేరకు ప్రఖ్యాత బాలీవుడ్ వెబ్ సైట్ పింక్ విల్లా ఆసక్తికర వివరాల్ని అందించింది.బాలీవుడ్ అందగత్తెల్లో క్వీన్ కంగన.. అనుష్క శర్మ వంటి టాప్ స్టార్లను అనుసరించే దక్షిణాది కథానాయికగా సమంతకు ఐడెంటిటీ ఉంది. అక్కినేని కోడలు సమంత ఈ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ విషయంలోనూ వారి నుంచి స్ఫూర్తి పొందినట్టే కనిపిస్తోంది. అక్షరాలా 59వేలు ఖర్చు చేసి మరీ సేమ్ టు సేమ్ బ్యాగ్ ని సొంతం చేసుకుంది. ఇటీవలే స్పెయిన్ ఇబిజకు ప్రయాణమైనప్పుడు విమానాశ్రయంలో ఇలా ఆ హ్యాండ్ బ్యాగ్ తో ప్రత్యక్షమైంది. ఓ బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సమంత తదుపరి `96` చిత్రీకరణతో బిజీగా ఉంది. తదుపరి ఓ వెబ్ సిరీస్ లోనూ నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.