అనుష్కను అందుకే చూపించలేదా..? సైరాలో అసలు పాత్ర ఇదే..?

స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. ‘బాహుబలి’ సిరీస్‌తో అప్పటికే ఉన్న పాపులారిటీని రెట్టింపు చేసుకున్న స్వీటీ.. ఆ తర్వాత ‘భాగమతి’ సినిమాతో అలరించింది. ఈ సినిమా తర్వాత అనుష్క కాస్త గ్యాప్ తీసుకోవడం, దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతోందంటూ టాక్ వినిపించడంతో తరచూ వార్తల్లో నిలిచింది. అయితే అనుష్క ‘సైరా’లో నటిస్తోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.సైరా నరసింహా రెడ్డి’లో అనుష్క నటిస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఫిక్స్ అయ్యారు జనం. ఎందుకంటే ఇటీవలే విడుదలైన ‘సైరా’ టీజర్ లో అనుష్కకు సంబందించిన సీన్స్ కానీ, ఆ ఛాయలు గానీ ఎక్కడా కనిపించలేదు కాబట్టి.

కానీ అనుష్క ఈ సినిమాలో నటించిందని, ఆమె ఇదే అంటూ గత రెండు రోజులుగా ఫిలింనగర్ సర్కిల్స్‌లో టాక్ మొదలైంది.అనుష్కను వెండితెరపై చూడాలని కుతూహలంగా ఉంది ప్రేక్షక లోకం. ఈ నేపథ్యంలో ఆమె క్యారెక్టర్ సీక్రెట్‌గా ఉంచి, డైరెక్ట్‌గా వెండితెరపైనే ఆవిష్కృతం చేయాలనే కోణంలో సైరా టీజర్‌లో అనుష్కను చూపించలేదని అంటున్నారు. అయితే ‘సైరా’లో ఆమె ఝాన్సీ లక్ష్మీభాయ్ క్యారెక్టర్‌లో కనిపించనుందని చెప్పుకుంటున్నారు.ఇకపోతే ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి కనిపించనుండగా, ఆయన భార్య సిద్దమ్మ పాత్రలో నయనతార అలరించనుంది. ఇక నృత్యకారిణిగా తమన్నా స్పెషల్ రోల్ పోషించింది. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది ‘సైరా నరసింహా రెడ్డి’ మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ తెలుగుతో పాటు ఇతర 4 భాషల్లో సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.