సైరాలో అసలు సీన్స్ ఇవే..? బయట పెట్టిన దర్శకుడు

మరి కొద్దీ రోజులో తెలుగు నుండి మరో పాన్ ఇండియా మూవీ రాబోతుంది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ సినిమా సైరా నరసింహ రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదల కానుంది. తెలుగు,తమిళ్,హిందీ ,కన్నడ,మలయాళం భాషలో దీనిని విడుదల చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా దర్శకుడు సురేంద్ర రెడ్డి ఈ సినిమాలోని కొన్ని కీలక ఘట్టాల గురించి చెప్పటం జరిగింది.ఇందులో అండర్ వాటర్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది సినిమాకే చెప్పుకోదగిన హైలైట్ సన్నివేశం.

ఇందులో తమన్నా,చిరంజీవితో పాటుగా విదేశీయులు కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో దాదాపు పది సన్నివేశాలకి పైగా రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో ఉంటాయని, వాటిని చూస్తుంటే ఒళ్ళు జలదరించటం ఖాయం.  ఇందులో అనుష్క ఝన్సీ లక్ష్మీబాయి పాత్ర పోహిస్తుంది. సినిమా మొదటిలో,చివరిలో దాదాపు 10 నిముషాలు ఆమె కనిపిస్తుంది.నయనతార నరసింహారెడ్డి భార్యగా, తమన్నా ఆయన ప్రేయసిగా కనిపిస్తుంది. ఇందులో ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా కూడా ఎక్కువ ఉంటుంది. మొదటి పార్ట్ మొత్తం నరసింహారెడ్డి యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఉంటుంది. రెండు పార్ట్ లో ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు ఉంటాయి  క్లైమాక్స్ మొత్తం ఎక్కువగా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి, ఫ్రీ క్లైమాక్స్ లో భారీ ఫైట్ ఒకటి ఉంటుంది. సినిమా మొత్తం మీద అదే అతి పెద్ద పోరాట సన్నివేశం. ఇందులో ఒక ఫైట్ కోసం జార్జియా 250 మంది ఇండియన్స్, 1000 దాక విదేశీయులతో భారీ సీన్స్ తీశారు, అవి ఖచ్చితంగా హై స్టాండెడ్ లో ఉంటాయని సమాచారం.