సాయిధరమ్ తేజ్ రియల్ లవ్ స్టోరీ..? ఆ హీరోయిన్ తో ఎఫైర్ బయటపెట్టిన యంగ్ హీరో..!

మెగా మేనల్లుడుగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం వరస పరజాయల నుండి ‘చిత్రలహరి’ మూవీతో కొద్దిగా తేరుకున్నాడు. అయితే ఈ యంగ్ హీరోను పూర్తిగా నిలబెట్టే హిట్ వస్తే కాని సాయి తేజ్ కెరియర్ కుదుటపడినట్లు కాదు.ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రతిరోజు పండుగే’ మూవీ రిజల్ట్ ను బట్టి ఈ మెగా యంగ్ హీరో కెరియర్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి తేజ్ తన రియల్ లవ్ స్టోరీని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.సాయి తేజ్ జీవితంలో ఉన్న లవ్ స్టోరీ ఒక విషాదాంతం. ఈ యంగ్ హీరో కాలేజీలో చదువుకునే రోజులలో ఒక అమ్మాయిని ప్రేమించాడట.

అయితే అప్పటికి అతడు కెరియర్ లో సెటిల్ అవ్వకపోవడంతో పాటు అవకాశాలకోసం చాలామంది దర్శక నిర్మాతల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గ్రహించిన ఆమె తేజ్ తో బ్రేకప్ చెప్పి మరొకరిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందట.ఈ విషయాన్ని స్వయంగా ఈ యంగ్ హీరో వివరించడంతో ఇప్పుడు ఈ హీరో లవ్ స్టోరీ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇదే సందర్భంలో తేజ్ మరొక ట్విస్ట్ ఇస్తూ తాను నటించే సినిమాలలో హీరోయిన్స్ తో చాల సరదాగా ఉంటానని అందువల్లనే తన పై రూమర్స్ చాల వస్తూ ఉంటాయి అని క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా రెజీనా రకుల్ రాశి ఖన్నా తనకు మంచి స్నేహితులు అని చెపుతూ ప్రస్తుతం తన ఇంటిలో తన తల్లి తనకు పెళ్ళి సంబంధాలు చూస్తోందని అయితే తాను హీరోగా పూర్తిగా సెటిల్ అయిన తరువాత మాత్రమే తాను పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇస్తున్నాడు..