సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త ఇల్లు చూసారా..? అదిరిపోయిన లుక్

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఓ భారీ ఇంటిని సెట్‌గా వేశారు. పల్లెటూరి వాతావరణంలో కొంచెం కొత్త, కొంచెం పాత సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ ఇల్లు సినిమాలో అత్యంత కీలకం. ఒరిజినల్‌ ఇంటి గురించి ట్రై చేశారు. కానీ, కథకు తగ్గట్లుగా ఉన్న ఇలాంటి ఇల్లు దొరక్కపోవడంతో, హైద్రాబాద్‌ శివార్లలో ఎకరం భూభాగంలో, 1.25 కోట్ల రూపాయలు వ్యత్యించి ఈ ఇంటి సెట్‌ని ఏర్పాటు చేశారు.

ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ ఈ ఇంటి సెట్‌ని రూపొందించారు. కేవలం 17 రోజుల్లోనే ఇంత భారీ ఇంటి సెట్‌ని రూపొందించారు. మచ్చుకైనా సిమెంట్‌ వాడకుండా, దీన్ని ఏర్పాటు చేయడం విశేషం. అందుకే ఈ ఇంటి సెట్‌ ఇప్పుడు టాలీవుడ్‌ టాక్‌ అయ్యింది. పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ ఇంటిని చూసేందుకు తరలి వస్తున్నారు.

దాంతో ఈ ఇంటి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోతున్నాయి. ఫుల్‌ ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌ మారుతి. తేజు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడు. ‘చిత్రలహరి’తో హిట్‌ కొట్టి ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న తేజు, ‘ప్రతిరోజూ పండగే’ అంటూ మరోసారి ఫ్యాన్స్‌కి పండగలాంటి హిట్‌ ఇస్తాడేమో వేచి చూడాలిక.