సాహో స్టోరీ లైన్ ఇదేనా.. నెట్టింట్లో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ‘సాహో’. భారతదేశ సినీ చరిత్రలోనే రికార్డులు తిరగరాసిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో అవి రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాహో’ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..‘సాహో’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. మొదట ముంబైలో, తర్వాత హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్నో విషయాలను పంచుకుంది.ఈ సినిమాలో ఒక సీన్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా మీడియా సమావేశంలో చెప్పాడు. ‘సినిమాలో ఓ సీన్‌ ఐదారుసార్లు వస్తుంది. అందులో ఐదు వేరియేషన్స్‌ ఉంటాయి. నటీనటుల కోణంలో చూసినా… దర్శకత్వం కోణంలో చూసినా… క్లిష్టతరమైన సన్నివేశం! దాన్ని సుజీత్‌ ఫస్ట్‌ డే తీశాడు. అందులో చిన్న కరెక్షన్‌ కూడా చేయలేదు. రీషూట్‌ చేయాల్సిన అవసరం రాలేదు. అప్పుడే తనపై నమ్మకం వచ్చేసింది’ అని అన్నాడు.ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం.. ‘ఈ సినిమా ప్రారంభంలో భారీ దోపిడీ జరుగుతుందట. అది ఎవరు చేశారో కనిపెట్టేందుకు అండర్ కవర్ కాప్ ప్రభాస్‌ను నియమిస్తారు. ఇక్కడి వరకు ట్రైలర్‌లో చూపించారు. ఇక, చివర్లో ఆ దోపిడీ చేసింది ప్రభాసేనని తెలుస్తుందట. అది ఎందుకు చేశాడనేదే మిగతా కథ.మాస్ మహరాజ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’ సినిమా కథతో దీన్ని పోలుస్తున్నారు. అందులో కూడా రవితేజ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ డబ్బును మంచి పనుల కోసం వాడతాడు. అలాగే, ఇందులో కూడా ప్రభాస్ దొంగతనం చేసి, ఆ డబ్బు మొత్తాన్ని ఓ సమస్యను పరిష్కరించేందుకు వాడతాడని అంటున్నారు.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ స్టోరీ మాత్రం తెగ వైరల్ అవుతోంది.యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.