సాహోపై ఇంకా స్పందించని రాజమౌళి.. ఆందోళనలో అభిమానులు

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సాహో ట్రైల‌ర్ విడుద‌లైంది. టాలీవుడ్ నుంచి కొంత మంది సెల‌బ్రిటీలు మెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా ప్ర‌భాస్ కుఫో న్ చేసి మ‌రీ అభినందించారు. అయితే టాప్ స్టార్లు మాత్రం ట్రైల‌ర్ పై స్పందించ‌లేదు. 300 కోట్లు ఖ‌ర్చు చేసి తెర‌కెక్కించిన సినిమాపై మెజార్టీ వ‌ర్గం మాట్లాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది. మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చర‌ణ్, బ‌న్నీ లాంటి వాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఇక స్నేహితుడు రానా సూప‌ర్ అని ఓ ఎమోజీ మాత్రమే పెట్టాడు. రాత పూర్వ‌కంగా ఎలాంటి కామెంట్ లేదు. దీనికి అర్ధం ఏంటి?

ఇవ‌న్నీ ప‌క్క‌న బెడితే ప్ర‌భాస్ ని ఇంట‌ర‌నేష‌న‌ల్ స్టార్ ని చేసిన రాజ‌మౌళి ఎందుకు మౌనంగా ఉన్న‌ట్లు? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. నిన్న‌టి రోజున మీడియా మీట్ లో ఇదే ప్ర‌శ్న రెయిజ్ అయింది. దీంతో ప్ర‌భాస్ త‌డ‌బాటుకు గుర‌య్యాడు. ఫోన్ చేసి మెచ్చార‌ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసారు. కానీ జ‌క్క‌న్న సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిప్రాయాన్నిమాత్రం షేర్ చేయ‌లేదు. చిన్న చిన్న సినిమాల విష‌యంలో నే జ‌క్క‌న్న‌కు న‌చ్చిందంటే షేర్ చేస్తాడు. 300 కోట్ల రూపాయ‌ల సినిమాపై ఎందుకు మౌనం వ‌హించిన‌ట్లు? వ‌ంటి సందేహాలు ప్ర‌భాస్ అభిమానుల‌ను అసంతృప్తికి గురి చేస్తాయి. మ‌రి వీట‌న్నింటికి సాహో ఎలాంటి బ‌ధులిస్తుందో చూడాలి.