సాహోలో శ్రద్దా కంటే ముందు అనుకున్న హీరోయిన్ ఏవరో తెలుసా..?

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత అగ్ర హీరో ప్రభాస్ నటించిన చిత్రం సాహో. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్, స్పై థ్రిల్ల‌ర్ మూవీ సాహో. ఈ సినిమా ఈ నెల 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమా విడుదలకు ఇంకా ఎనిమిది రోజులు ఉన్నా సినిమా ఎప్పుడెప్పుడా అని పడిగాపులు కాస్తున్నారు ప్రభాస్ అభిమానులు.

అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంతో పాటు ప‌లు భాష‌ల‌లో రిలీజ్ చేయబోతున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమ ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సాహో చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తుండడంతో ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని హీరోయిన్ గా ఫస్ట్ ఆప్షన్ బాలీవుడ్ మెరుపుతీగ కత్రినా కైఫ్ ని ప్రభాస్ సరసన నటింపజేసేందుకు అడిగారట. కానీ సాహో చిత్రం కోసం కత్రినా ఏకంగా 5 కోట్లు అడగడంతో ఆ ఛాన్స్ శ్రద్ధాకపూర్ కొట్టేసిందని అంటున్నారు. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో కాదో తెలియాలంటే సాహో చిత్రబృందం చెప్పే వరకు వేచి చూడాల్సిందే.