సాహోకి ప్రభాస్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పుకుంటోన్న ‘సాహో’ చిత్రం ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ‘సాహో’పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కానీ, తాజాగా చిత్ర బడ్జెట్ గురించి ప్రభాస్ చెప్పిన సమాధానం వింటే నోళ్లెళ్లబెట్టాల్సిందే! ఎందుకంటే, ఈ సినిమాకు అక్షరాలా రూ.350 కోట్లు ఖర్చుపెట్టారట.ఇక సాహో సినిమా కోసం ఎంత పారితోషికం ఇచ్చారు అన్నది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే.. బాహుబలి తర్వాత ప్రభాస్ డేట్స్ కాస్ట్ లీ అయిపోయాయి.

పైగా ఈ సినిమా ఎక్కువ డేట్స్ డిమాండ్ చేసింది. మధ్యలో వేరే సినిమా చేసే అవకాశం కూడా లేకపోయింది. దీంతో గట్టిగానే పారితోషికం అందుండాలి. కానీ ఇంతవరకు ఆ వివరాలు పెద్దగా బయటకు రాలేదు. పైగా ఈ సినిమా బిజినెస్ జరిగింది కేవలం ప్రభాస్ ని చూసే. అత‌డి పేరు మీదే ఈ సినిమా సేల్ అయింది. అలాంటపుడు మనోడికి భారీగానే ముట్టుండాలి. ఆల్మోస్ట్ బడ్జెట్లో పావు వంతు సుమారు 40-50 కోట్లు ప్రభాస్ కి అంది ఉండలి. ఓ ఇంట‌ర్వ్యూలో రెమ్యునరేషన్ గురించి అడిగితే.. నిర్మాతలు త‌న మిత్రులే అని, దాని గురించి ఇంకా మాట్లాడుకోలేదని చెప్పారు. సినిమా రిలీజ్ త‌ర్వాత ఆలోచిస్తామన్నారు.