RRR లో అదే హైలెట్ సీన్.. అదరగొట్టేసింది

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ ఒకటి. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన తర్వాత రాజమౌళి టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి బ్రాండ్ నేమ్ కు తోడు రామ్ చరణ్.. ఎన్టీఆర్ లాంటి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు తోడవడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.’RRR’ టీమ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది.

రాజమౌళి అమెరికా ట్రిప్ లో ఉండగా.. చరణ్ ‘సైరా’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ గ్యాప్ లో ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే నెక్స్ట్ వీక్ లో ‘RRR’ షూటింగ్ ప్రారంభం కాగానే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారట. ఈ యాక్షన్ బ్లాక్ ను దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ఒక హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే ‘RRR’ టీమ్ మాత్రం చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి పాల్గొనబోతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ పై పెదవి విప్పడం లేదు.

ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే అలియా ‘RRR’ టీమ్ తో జాయిన్ అవుతుందని సమాచారం. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30 న RRR విడుదల అవుతుంది.