RRR దెబ్బ.. రాజమౌళి అస్సలు నిద్ర పోవడం లేదుగా..?

బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ . రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ని దానయ్య నిర్మిస్తున్నారు. గత కొద్దీ రోజులుగా ఈ మూవీ షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూనే ఉంది. ఈ మధ్యనే ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరుగుతుంది.ఎలాగైనా అనుకున్న సమయానికి సినిమాను తీసుకొచ్చేందుకు రాజమౌళి నిద్ర పోకుండా పరుగులు పెట్టిస్తున్నాడట.

అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్నరాత్రి జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నారట. రాత్రి సమయంలో జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే చరణ్ కు సంబంధించిన సన్నివేశాలను కోకాపేట్ లోని సెట్ లో పగలు షూట్ చేస్తున్నారట. వారం తర్వాత ఇద్దరూ కలిసి ఉండే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.