RRR డిలేకు అసలు రీజన్ ఇదేనా..? జక్కన్న అందుకుంటాడా..?

బాహుబలి లాంటి చారిత్రాత్మకమైన చిత్రాల తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. తాను తీసే సినిమాకు తానె ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చి పెట్టాడు రాజమౌళి. కానీ ఆయన ఏదైనా సినిమా ప్రారంభించారంటే మాత్రం అది ఇప్పట్లో విడుదల అవ్వదు అనేది అందరికి తెలిసిందే. కాగా RRR విషయంలో కూడా అదే జరుఇగుతుందని అందరు భయపడుతున్నారు. ఏమైందో తెలీదుకానీ సినిమా ప్రారంభించినప్పటినుండే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే జక్కన్న పాత్రలని తెర మీద అంత చక్కగా చూపించడానికి చాలా కష్టపడతారు.

అయితే వచ్చే ఏడాది జులై లో విడుదల చేస్తానని జక్కన అధికారికంగానే ప్రకటించారు కానీ ఇప్పటివరకైతే అనుకున్న షెడ్యూల్ అనుకున్న టైం కి పూర్తవడంలేదని సమాచారం ఎందుకంటే చిత్ర హీరోలు ఎప్పటికి గాయాలతో తీవ్రంగా బాధపడుతున్నారని సమాచారం. అంటే ఈ చిత్రం అంత చక్కగా రావడానికి అందరు కూడా అంతలా కష్టపడుతున్నారని సమాచారం. కొన్ని రోజులు ఎన్టీఆర్ గాయాల బారిన పడితే, మరికొన్ని రోజులు రామ్ చరణ్ గాయాలను ఎదుర్కుంటున్నారు. అయితే ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా అనుకున్న టైం కి విడుదల అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్సు గానే ఉంది.